సంబంధిత వార్తలు
- ప్రభుత్వ పాఠశాలల్లో త్వరితగతిన పనులు పూర్తి : మంత్రి ఆదిమూలపు సురేష్
- ప్రాణాలను ఫణంగాపెట్టి ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోస్తున్నాం .. మద్యం బాబుల కామెంట్స్
- 'అమ్మ ఒడి పథకం' డబ్బులు - 'నాన్న గొంతు తడి'కే ఖర్చయిపోతున్నాయ్...
- ఏపీలో మద్యం దుకాణాల వద్ద టీచర్లకు విధులా? : పవన్ కళ్యాణ్
- నెట్వర్క్ హాస్పిటల్స్ లో వైద్య సేవలు ప్రారంభం
శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు అంకురార్పణ
తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో మే 6 నుండి 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించే వార్షిక వసంతోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.
ఈ సందర్భంగా ఆలయంలో సాయంత్రం పుణ్యహవచనం, రక్షాబంధనంతోపాటు అంకురార్పణ నిర్వహించారు. ఆ తరువాత శ్రీ విష్వక్సేనులవారిని ఆలయ ప్రాంగణంలో ఊరేగింపు చేపట్టారు.
ఈ ఉత్సవాల్లో భాగంగా మే 6 నుండి 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు ఆలయంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం చేపడతారు. అలాగే రాత్రి 7 నుండి 7.30 గంటల వరకు ఆలయ ప్రాంగణంలోనే అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తారు.
కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలోనే ఏకాంతంగా నిర్వహిస్తారు. ఆర్జిత సేవలను రద్దు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటి ఈఓ ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, ఏఈఓ సుబ్రమణ్యం, కంకణభట్టార్ మణికంఠస్వామి తదితరులు పాల్గొన్నారు.
తర్వాతి కథనం
