1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. TDP Mp Murali Mohan not contest in Next Election

ఎన్నికల్లో పోటీ చేయనంటున్న టీడీపీ ఎంపీ.. ఓడిపోతాననే భయమా?

Murali Mohan
ఎన్నికల సమయం సమీపిస్తోంది. రాష్ట్రంలో రాజకీయం మారిపోతోంది. అధికార పార్టీ నేతలు విపక్ష పార్టీలోకి, విపక్ష పార్టీ నేతలు అధికార పార్టీలోకి మారిపోతున్నారు. మరికొందరు అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేయడానికి విముఖత చూపిస్తున్నారు. ఇలాంటి వారిలో సినీ నటుడు ఎం. మురళీ మోహన్ ఒకరు. 
 
ఈయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. అంతేనా.. తన కోడలు రూప కూడా పోటీ చేయబోదని ప్రకటించారు. ఈ ప్రకటన తెదేపా శ్రేణులను విస్మయానికి గురిచేసింది. అయితే, ఆయన ఈ తరహా నిర్ణయం తీసుకోవడాని ప్రధాన కారణం... వచ్చే ఎన్నికల్లో తెదేపా ఓడిపోతుందని, వైపాకా గెలుస్తుందనే సందేశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మురళీ మోహన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 
 
ప్రస్తుతం మురళీ మోహన్ రాజమండ్రి ఎంపీగా కొనసాగుతున్నారు. ఈయన రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయరాదని తీసుకుని, ఇదే విషయాన్ని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి ఆయన వివరించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదే సమయంలో మురళీమోహన్ కోడలు రూప కూడా పోటీ చేయకూడదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
తాను ఏర్పాటు చేసిన ట్రస్ట్ కార్యకలాపాలపై మరింత దృష్టిని సారించాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. నేడు రాజమహేంద్రవరం ఎంపీ స్థానం, దాని పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో నిలపాల్సిన అభ్యర్థులపై చంద్రబాబు సమీక్ష నిర్వహించనుండగా, దానికి హాజరై, తన మనసులోని అభిప్రాయాన్ని మురళీమోహన్ వెల్లడిస్తారని టీడీపీ వర్గాల సమాచారం. 
తర్వాతి కథనం
కడపలో టెన్త్ విద్యార్థినిపై రేప్... సహవిద్యార్థితో కలిసి పూర్వవిద్యార్థి ఘాతుకం