సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (11:52 IST)

వెన్నుపోటుదారుడికి ముందుపోటు ఖాయం : వర్మ ట్వీట్

నిత్యం ఏదో ఒక ట్వీట్‌తో నిత్యం వార్తల్లో యాక్టివ్‌గా ఉండే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా చేసిన ఓ ట్వీట్ వైరల్ అయింది. వెన్నుపోటుదారునికి ముందుపోటు ఖాయమంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గత ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌తో చేయి కలిపి ముందుకు సాగిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ఎప్పటిలా తన వెన్నుపోటు పొడిచారని చెప్పారు. దీనికి ప్రతీకారంగా వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తన నైజములో ఉన్న నిజాయితీతో చంద్రబాబును ముందుపోటు పొడుస్తాడని జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా పవన్ పవర్ మీద తనకు అత్యంత మెగా నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. వర్మ చేసిన ఈ కామెంట్స్ చర్చనీయంశంగా మారాయి.
 
"సీ.బీ.ఎన్, పీ.కేని వాడుకుని అలవాటు ప్రకారం వెన్నుపోటు పొడిచినందుకు ప్రతీకారంగా రానున్న ఎన్నికలలో పవన్ కళ్యాణ్‌ తన నైజములో ఉన్న నిజాయితీతో చంద్రబాబు నాయుడుని ముందుపోటు పొడుస్తాడని పీకే పవర్ మీద నా అత్యంత మెగా నమ్మకం" అని చెప్పారు.