శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 23 ఫిబ్రవరి 2019 (08:13 IST)

ఇదేంటయ్యా.. ఎవర్ని కలిసినా రాసేస్తారా? పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీతో జనసేన పార్టీ కలిసి రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లబోతోందని జరిగిన ప్రచారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ''జనసేన వైసీపీ-బీజేపీలకు భాగస్వామిగా ఉందని టీడీపీ చెబుతోంది. 
 
ఇప్పుడు టీడీపీతో మేం కలిసిపోయామని వైసీపీ చెబుతోందని.. తాను రాజ్‌భవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ కాగానే.. తాను టీఆర్ఎస్-వైసీపీ మనిషినని టీడీపీ ఆరోపిస్తుంది. మనం నిజంగా ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు అన్ని పక్షాల నుంచి విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది'' అని ట్వీట్ చేశారు. దీనికి స్మైలీ ఎమోజీని పవన్ కల్యాణ్ జత చేశారు.
 
టీడీపీ, వైసీపీలు జనసేనను దెబ్బతీయడానికి ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. ఓ సీనియర్ రాజకీయ నేత తనకు చెప్పారన్నారు పవన్. ఈ విషయాలన్నీ చెప్పడానికి తనకు న్యూస్ పేపర్, ఛానల్ లేదన్నారు. జనసైనికులే తనకు పేపర్లు, ఛానల్స్ అన్నారు. రాజకీయ చదరంగంలో తానో చిన్న పావునన్నది నిజమే.. కానీ పోరాటానికి సిద్ధమైన సైనికుడిని అని పవన్ చెప్పారు.