సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 21 ఫిబ్రవరి 2019 (12:45 IST)

లక్ష్మీస్ ఎన్టీఆర్‌పై బాబు ఫైర్.. వీడియోతో కౌంటరిచ్చిన వర్మ.. ఏమైనా సరే..?

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకునే ''లక్ష్మీస్ ఎన్టీఆర్'' సినిమా గురించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. వాస్తవాలను వక్రీకరించి సినిమాలు తీస్తే.. ప్రజలు వాటిని చూడబోరని చెప్పారు. వారిణి ప్రజలే గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే వస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 
 
టీడీపీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన వేళ, చంద్రబాబునాయుడు స్పందించారు. ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరించేందుకు కొందరు కుట్రలు పన్నారని విమర్శించారు. కుట్రదారులతో చేతులు కలిపిన దర్శకులను తిరస్కరించాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. ఎన్టీఆర్ జీవితం ఎందరికో స్ఫూర్తని, అందుకే మహానాయకుడు, కథానాయకుడు చిత్రాలు ఆ స్ఫూర్తిని చాటి చెప్పేలా వస్తున్నాయని తెలిపారు. 
 
కాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న వేళ.. ఆ సినిమాను వాస్తవాలను వక్రీకరించారని చంద్రబాబు చేసిన కామెంట్లపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కౌంటరిచ్చాడు. ఓ వీడియో టీజర్‌ను కూడా ఈ కౌంటర్‌తో జత చేశారు. మహానాయకుడులోని రానా (చంద్రబాబు పాత్రధారి) ఈ వీడియోలో కనిపిస్తాడు.
 
ఇంకా ఈ వీడియోలో "లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ మీద వచ్చే రకరకాల రియాక్షన్స్‌కు మీ నుండి వచ్చే రియాక్షన్‌ ఏంటి సార్‌?" అని జర్నలిస్ట్ ప్రశ్నించినట్టుగా, "దానికి సమాధానంగా మీరేమన్నా సరే రియాక్ట్ కావొద్దు, ఏమన్నా సరే" అంటున్న రానాను చూపించారు. ఈ వీడియో బిట్ 'మహానాయకుడు' థియేటరికల్ ట్రైలర్ లోనిదేనని వర్మ గుర్తు చేశాడు. ఇక దీనికి క్యాప్షన్‌గా "లక్ష్మీస్ ఎన్టీఆర్‌పై చంద్రబాబు భయం ఇలా ఉంది" అని రాశారు.