గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (18:16 IST)

ఆ విషయంలో బాబును ఫాలో అవుతున్న జగన్..!

ఎపి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేతల హామీలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అమలు సాధ్యం కాని హామీలు ఇస్తున్న నేతలను చూసి విశ్లేషకులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఎన్నికల సమయంలో హామీలివ్వడం మామూలే గానీ ఈసారి ఎపిలో ఈ స్థాయిలో హమీలివ్వడం అదే మొదటిదంటున్నారు  విశ్లేషకులు.
 
అయితే గత ఎన్నికల్లో చంద్రబాబు హామీలిచ్చే అధికారాన్ని చేజిక్కించుకోగలిగారనేది వారి వాదన. అందుకే ఈ ఎన్నికల్లో చంద్రబాబును ఏ విధంగాను గెలవనీయకుండా చేయాలన్న ఆలోచనలో ఉన్నారు జగన్. అందుకే జగన్ తెలుగుదేశం అధినేత ఏ హామీలైతే ఇస్తారో వాటిని మించిన హామీలు ఇస్తున్నారని అంటున్నారు. మరి అధికారంలోకి వచ్చాక ఇవన్నీ అమలుపరచడం సాధ్యమా అనే ప్రశ్నలైతే వస్తున్నాయి. చూడాలి ఓటరుదేవుడు ఎవరికి పట్టం కడుతాడో?