బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 1 మార్చి 2019 (10:52 IST)

కడపలో టెన్త్ విద్యార్థినిపై రేప్... సహవిద్యార్థితో కలిసి పూర్వవిద్యార్థి ఘాతుకం

కడప జిల్లా ప్రొద్దుటూరులో పదో తరగతి విద్యార్థిని ఒకరు అత్యాచారనికి గురైంది. ఆ బాలిక క్లాస్‌మెట్‌తో కలిసి పూర్వ విద్యార్థి ఒకరు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పైగా, ఈ విషయం పాఠశాల యాజమాన్యానికి తెలిసినా వారు అత్యాచార బాధితురాలినే బెదిరించారు. బయటకు చెబితే పరీక్షల్లో బెదిరిస్తామంటూ హెచ్చరించారు. దీంతో ఆ బాలిక తనకు జరిగిన అన్యాయాన్ని తనలోనే దాచిపెట్టుకుని కుమిలిపోయింది. ఆ తర్వాత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రొద్దుటూరులో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో ఓ బాలిక చదువుతోంది. ఈమె ఆ పాఠశాలకు చెందిన హాస్టల్‌లో ఉంటూ విద్యాభ్యాసం చేస్తూ వస్తోంది. కానీ, అదే పాఠశాలలో చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థి.. పూర్వ విద్యార్థితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన 24వ తేదీన జరుగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
అయితే, ఆ బాలిక తనకు జరిగిన అత్యాచారంపై పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. అయితే, ఈ విషయం గురించి బయట ఎక్కడైనా చెబితే పది పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని బెదిరించారు. దీంతో ఏం చేయాలో తోచని విద్యార్థిని పాఠశాల మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. తీవ్ర గాయాలపాలైన బాలిక అప్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. 
 
బాలిక కాలు జారి కిందపడిందని కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన స్కూలు యాజమాన్యం ఆమెను కర్నూలు జిల్లాలో వైద్యం చేయించేందుకు ప్రయత్నించింది. గురువారం రాత్రి కుటుంబ సభ్యులు బాలికను ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకురావడంతో విషయం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరూ మైనర్లేనని పోలీసులు తెలిపారు.