గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 అక్టోబరు 2024 (19:38 IST)

పవన్ కళ్యాణ్ వల్ల సమాజంలో అశాంతి నెలకొంది : కేఏ పాల్ ఫిర్యాదు

ka paul
తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ కల్తీ అంశంపై జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల వల్ల సమాజంలో అశాంతి నెలకొందని ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ ఆరోపించారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన హైదరాబాద్ నగరంలోని పంజాగుట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారంలో పవన్ కళ్యాణ్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారని ఆరోపించారు. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల వ‌ల్ల సమాజంలో అశాంతి వాతావ‌ర‌ణం నెల‌కొంద‌ని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. త‌న ఫిర్యాదు ఆధారంగా విచార‌ణ చేసి ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ప్రకాష్ రాజ్ స్వార్దపరుడు.. నిర్మాత నట్టి కుమార్ 
 
నటుడు ప్రకాష్ రాజ్ స్వార్థపరుడు అని నిర్మాత నట్టి కుమార్ ఆరోపించారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం‌ మాట్లాడుతుంటే, అప్పటి నుంచే ఆయనంటే కొందరికి పడటం లేదన్నారు. ప్రకాష్ రాజ్ ఇష్టం వచ్చినట్లు ఎదెదో మాట్లాడుతున్నాడు. ఆయన స్వార్థపరుడు అన్నారు. ఎనాడన్నా ఇండస్ట్రీ కోసం, ప్రజల కోసం ఎమన్నా చేశావా ప్రకాష్ రాజ్ అని ప్రశ్నించారు. 
 
ప్రజ్వల్ రేవన్న ఇన్సిడెంట్‌పై ప్రకాష్ రాజ్ ఎందుకు స్పందిచలేదన్నారు. రజనీకాంత్ అన్నప్పుడు ఏమి స్పందించలేదన్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ పేరు చెప్పి దేవుడిని అవమానిస్తున్నారన్నారు. పవన్ కల్యాణ్ కాలి గోటికి ప్రకాష్ రాజ్ సరిపోడన్నారు. ఇదంతా డైవర్షన్ కోసం చేస్తున్నట్టుందన్నారు. చిరంజీవిని అవమానించినప్పుడు, ఐదు రూపాయల టికెట్ పెట్టినపుడు, ప్రకాష్ రాజ్ ఎందుకు జగన్‌పై ట్వీట్ చేయలే అన్నారు. 
 
కేసీఆర్ ఇండస్ట్రీ అమ్మాయిలను డ్రగ్స్ పేరుతో నిలబెట్టినపుడు ఎందుకు ట్వీట్ చేయలా, అప్పుడు ఉంది మీ ప్రభుత్వాలే అనే చేయలేదా అని అన్నారు. టిడిపి, పవన్ కల్యాణ్ అధికారంలో ఉంటేనే మీకు ట్వీట్‌లు వెస్తారా అని అన్నారు. రేణు దేశాయ్ ట్రోలింగ్ గురైనపుడు ఇండస్ట్రీ ఎమైందన్నారు. భువనేశ్వరిపై అసభ్యంగా మాట్లాడినపుడు ఇండస్ట్రీ ఎక్కడకు వెళ్లిందన్నారు. 
 
ప్రకాష్ రాజ్ ట్వీట్ ఎందుకు వేయలా, రజినీకాంత్‌పై నీచంగా మాట్లాడితే ఇండస్ట్రీ ఖండన లేదే అన్నారు. జగన్ కేసిఆర్ అంటే మీకు భయమా అని ప్రశ్నించారు. అంజనా దేవిపై పోసాని అసభ్యంగా మాట్లాడితే ఖండన ఏదన్నారు. కొండా సురేఖ మాట్లాడింది తప్పే‌.. ఆవిడ క్షమాపణ చెప్పారని గుర్తు చేశారు. కానీ నాడు వైసిపి వారు, పోసాని మాట్లాడింది నీచాతినీచం అని అన్నారు. 
 
ప్రకాష్ రాజ్ పొలిటికల్‌గా వచ్చి పవన్ కల్యాణ్‌ను ఎదుర్కోవాలన్నారు. అంతేకానీ ఇండస్ట్రీ ముసుగులో ట్వీట్స్ కరెక్ట్ కాదన్నారు. జానీ మాస్టర్‌పై పొక్సో కేసు ఉందని ఇండస్ట్రీ వాళ్లే మెయిల్ పెట్టారు. అందుకే అవార్డ్ రద్దు అయింది.. దీని వెనుక కుట్ర కోణం ఉందన్నారు. నేషనల్ అవార్డ్ అనేది డాన్సర్స్ యూనియన్‌కే గర్వకారణమన్నారు. జానీ మాస్టర్ వ్యవహారంలో అసలు నిజాలు బయటకు వస్తాయి. అతనికి జరిగిన అన్యాయంపై డాన్సర్స్ యూనియన్ గట్టిగా మాట్లాడాలని కోరారు.