గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2024 (18:06 IST)

సూడో సెక్యులరిస్టులే పవన్‌ను విమర్శిస్తున్నారు : కె.నాగబాబు

Nagababu
హిందువులే హిందూ మతాన్ని  అగౌరవపరుస్తున్నారని, సూడో సెక్యులరిస్టులే తమ పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తున్నారంటూ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, సినీ నటుడు కె.నాగబాబు అన్నారు. శ్రీవారి లడ్డూ కల్తీ అంశంపై ఆయన మాట్లాడుతూ, హింధూ ధర్మం దెబ్బతినిందని చెప్పడానికి లడ్డూ అంశం క్లైమాక్స్ లాంటిందన్నారు. దేశంలో ఒక మతాన్ని మరో మతం గౌరవిస్తూ బతుకుతుందన్నారు. 
 
సనాతన ధర్మం కలిసి బతకడం నేర్పించిందని, సనాతన ధర్మానికి అన్యాయం జరుగుతుందనే పవన్ కళ్యాణ్ గొంతెత్తారని చెప్పారు. పవన్ కళ్యాణ్ మాటలకు పూర్తిగా సమర్థిస్తున్నట్టు చెప్పారు. హిందు దేవాలయాలు, ధార్మిక మండళ్లు హిందువులే చేయాలన్నారు. ప్రభుత్వాల నిర్ణయాలు కోట్లాది మంది హిందువులపై ప్రభావం చూపుతున్నాయనేదే పవన్ కళ్యాణ్ ఆవేదన అని అన్నారు. హిందువులే హిందు మతాన్ని అగౌరవిస్తున్నారని తెలిపారు. 
 
హిందూవుల్లో ఉన్న సూడో సెక్యులరిస్టుల మీద కళ్యాణ్ మాట్లాడారని, హిందువులే హిందువులను అగౌరవపరుస్తున్నారని తెలిపారు. అసలైన సెక్యులర్ వాది పవన్ కళ్యాణ్ అన్నారు. సూడో సెక్యులర్ ప్రకాశ్ రాజ్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, అన్ని మతాలతో సఖ్యంగా ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని గుర్తుచేశారు. హిందూ ధర్మ రక్షణ మండలి అవసరమని ఆయన నొక్కివక్కాణించారు. 
 
శ్రీవారి కల్తీ లడ్డూ అంశంలో చట్టం పని తాను చేసుకుపోతుందని, దోషులెవరున్నా బయటికి వస్తారని, వైసీపీ నాయకుల విమర్శలకు సమాధానాలు అవసరం లేదని నాగబాబు స్పెష్టం చేశారు.