గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 అక్టోబరు 2024 (19:02 IST)

ఏపీ మాజీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌కు బిగుస్తున్న ఉచ్చు...

sunil kumar
గత వైకాపా ప్రభుత్వంలో ఐపీఎస్ అధికారుల్లో కొందరు వైకాపా ఆఫీసర్లుగా నడుచుకున్నారు. ఇలాంటి వారి మెడకు ఇపుడు ఉచ్చు బిగుస్తుంది. పలువురు బాధితులు వచ్చి ఐపీఎస్ అధికారులపై ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో వారిపై కేసులు నమోదవుతున్నాయి. 
 
తాజాగా టీడీపీ ఉండి ఎమ్మెల్యే, వైకాపా మాజీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారంలో సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. నగరంపాలెం పోలీస్ స్టేషన్‌‍లో దాఖలైన ఫిర్యాదుకు సంబంధించిన అభియోగాలపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని జీఏడీ రాజకీయ కార్యదర్శి ఎస్.సురేశ్ కుమర్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. 
 
ఈ మేరకు ప్రభుత్వం జీవో నంబర్ 1695ను విడుదలచేసింది. అభియోగాలపై వివరణ ఇచ్చే క్రమంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు తీసుకువచ్చే ప్రయత్నం చేసినా పర్యావసానాలు తీవ్రంగా ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. సునీల్ కుమార్ తన వివరణను లిఖితపూర్వకంగా ఇవ్వాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ఆయన చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది.