1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. TPCC Working President Revanth Reddy Chit Chat With MEDIA over ED case

రాజకీయంగా వేధించేందుకే ఈడీ కేసు : రేవంత్ రెడ్డి

Revanth Reddy
తనను రాజకీయంగా వేధించేందుకు తనపై ఈడీ కేసును నమోదు చేశారని టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా 150 కోట్ల మేరకు నగదు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. 
 
తనపై గెలిచిన పట్నం నరేందర్ రెడ్డి వద్ద కూడా రూ.50 లక్షలు మేరకు స్వాధీనం చేసుకున్నారని, ఆయనపై ఈడీ ఎందుకు కేసు నమోదు చేయలేదని చెప్పారు. అలాగే, నగదు స్వాధీనం చేసుకున్న వారందరిపై కేసులు నమోదు చేశారా అని ఆయన ప్రశ్నించారు. 
 
సోమవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీలు ఏకమయ్యారని అందుకే తమపై ఈడీ కేసును నమోదు చేశారన్నారు. ముఖ్యంగా, డబ్బు పట్టుకున్న కేసులో చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత కేసును ఈడీకి బదిలీ చేయడం వెనుక ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. 
 
అదేసమయంలో తెరాసలో కేటీఆర్ కంటే హరీశ్ రావే అర్హుడన్నారు. మొదటి నుంచి ఉద్యమంలో ఉన్న నాయకుడిగా హరీశ్‌పై ప్రజల్లో సానుభూతి ఉందన్నారు. తోటపల్లి, గౌరారం రిజర్వాయర్లలో రూ.వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ స్కామ్‌లో హరీశ్ రావు రూ.600 కోట్ మేరకు వెనుకేసుకున్నారని ఆరోపించారు. ఆ డబ్బులను మొన్నటి ఎన్నికల్లో తెరాస అభ్యర్థులకు పంచారని విమర్శించారు. 
తర్వాతి కథనం
కొందరు చెత్త వాగుడు వాగుతున్నారు : రంజన్ గగోయ్ సీరియస్