సంబంధిత వార్తలు
- ఎపి ప్రాజెక్టులపై శ్రద్ధ చూపండి: కేంద్ర మంత్రిని కోరిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
- కోడెల ఆత్మహత్యపై నివేదిక కోరుతా ... ఏపీలో పత్రికా స్వేచ్ఛకు భంగం : కిషన్ రెడ్డి
- మోడీ 100రోజుల సర్కార్ పై 'జన్ కనెక్ట్' బుక్ రిలీజ్
- కేసుల్లో నేతలకు కేరాఫ్ అడ్రస్ రాంజెఠ్మలానీ
- అరుణ్ జైట్లీ జీవిత విశేషాలు.. న్యాయవాది.. మంచి మనసున్న వ్యక్తి.. (video)
వైకాపా దాడులకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు : మంత్రి కిషన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా దాడులకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి చెప్పారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో పని చేస్తోందని, ఇది మంచి పద్ధతి కాదన్నారు.
బీజేపీ కార్యకర్తలపై వైసీపీ దాడులకు పాల్పడుతోందనే ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా మంచి పాలన అందించాలని, కక్ష సాధింపులు మంచి సంప్రదాయం కాదనే విషయం గ్రహించాలని సూచించారు.
గత టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలనే వైసీపీ కూడా చేస్తోందని విమర్శించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని కిషన్ రెడ్డి అన్నారు.
ఎక్కడైనా సరే మాతృభాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. మహారాష్ట్రలో పొత్తు ధర్మానికి శివసేన తూట్లు పొడిచిందని... పొత్తు లేకపోతే బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదని తెలిపారు.
తర్వాతి కథనం
