సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 నవంబరు 2019 (18:07 IST)

మితిమీరిన వేగం వల్లే రాజశేఖర్ కారు ప్రమాదం.. మద్యం సీసాలు గుర్తింపు (video)

టాలీవుడ్ హీరో డాక్టర్ రాజశేఖర్ కారు పెద్ద గోల్కొండ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు అప్పా జంక్షన్ వద్ద ప్రమాదానికి గురైంది. రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి మంగళవారం అర్థరాత్రి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో రాజ‌శేఖ‌ర్ స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. 
 
అయితే ప్ర‌మాదం జ‌రిగిన కొద్ది సేప‌టి త‌ర్వాత సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు కారుని సీజ్ చేసి పోలీస్ స్టేష‌న్‌కి త‌ర‌లించారు. కారులో మ‌ద్యం సీసాలు ఉండ‌టాన్ని వారు గుర్తించారు. అంతేకాదు ఓఆర్ఆర్‌లో వంద కిలోమీట‌ర్ వేగంతో వెళ్ళాల్సిన కారు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లి ఉంటుంద‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
కాగా, ఈ కారుపై ఇప్ప‌టికే మూడు ఓవర్ స్పీడ్ చలానాలు కూడా ఉన్నాయట‌. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఒకటి, సైబరాబాద్ పరిధిలో రెండు చలానాలు ఉన్నాయి. రూ.3 వేల జరిమానా పెండింగ్‌లో ఉందని పోలీసులు అంటున్నారు. దీనిపై పూర్తి ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. 
 
మరోవైపు, మీడియాలో వస్తున్న వార్తలన్నింటినీ హీరో రాజశేఖర్ భార్య జీవితా రాజశేఖర్ కొట్టిపారేశారు. ఆర్ఎఫ్‌సీ నుంచి వస్తుండగా, కారు టైరు పంక్చర్ కావడంతో డివైడర్‌ను ఢీకొని కారు పల్టీ కొట్టిందనీ ఈ ప్రమాదంలో రాజశేఖర్‌కు ఎలాంటి గాయాలు కాలేదని వివరించారు.