1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Upasana comments on Ram Charan not attend GES-2017

ఆ కారణాల వల్లే మా ఆయన రాలేకపోయారు: ఉపాసన

హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో టాలీవుడ్ హీరో రాంచరణ్ భార్య ఉపాసన కూడా ఉన్నారు. ఈమె అపోలో హాస్పిటల్స్ వైస్ ఛైర్‌పర్

GES-2017
హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో టాలీవుడ్ హీరో రాంచరణ్ భార్య ఉపాసన కూడా ఉన్నారు. ఈమె అపోలో హాస్పిటల్స్ వైస్ ఛైర్‌పర్సన్ హోదాలో ఈ సదస్సుకు హాజరయ్యారు. అంతేకాకుండా మంగళవారం రాత్రి ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన విందులో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
 
అయితే, ఈ సదస్సుకు తన భర్త చెర్రీ గైర్హాజరు కావడంపై ఆమె స్పందిస్తూ, ఇతర కార్యక్రమాల్లో తప్పని సరిగా పాల్గొనాల్సి రావడం కారణంగా చెర్రీ జీఈఎస్‌కి రాలేకపోయారని తెలిపారు. 
 
ఈ సదస్సుకు ఆహ్వాన పత్రికలు అందుకున్న వారిలో హీరో రాంచరణ్ కూడా ఉన్నారు. నటుడిగానేకాకుండా నిర్మాతగా, వ్యాపారాల్లో కూడా చెర్రీ భాగస్వామిగా ఉన్న విషయం తెల్సిందే. అందుకే ఆయనకు జీఈఎస్ ఆహ్వానం అందింది. 
About Writer
pnr
తర్వాతి కథనం
సమాజంలో లింగభేదం ఉండరాదు : మానుషి