సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 20 నవంబరు 2017 (10:57 IST)

ఉపాసన కాఫీమేకింగ్ వీడియో

మెగాస్టార్ చిరంజీవి కోడలు, చెర్రీ భార్య ఉపాసన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఉపాసన జిమ్ రంగంలోకి అడుగుపెట్టి మహిళా వ్యాపారుల జాబితాలో చేరిపోయారు. చెర్రీతో తీసే ఫోటోలు పర్సనల్ విషయాల

మెగాస్టార్ చిరంజీవి కోడలు, చెర్రీ భార్య ఉపాసన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఉపాసన జిమ్ రంగంలోకి అడుగుపెట్టి మహిళా వ్యాపారుల జాబితాలో చేరిపోయారు. చెర్రీతో తీసే ఫోటోలు పర్సనల్ విషయాలను  సోషల్ మీడియా ద్వారా పంచుకునే ఉపాసన.. తాజాగా కాఫీ మేకింగ్ గురించి ఓ వీడియోను అప్ లోడ్ చేసింది. 
 
సోషల్ మీడియా ద్వారా నెటిజన్స్‌కి హెల్త్ టిప్స్ కూడా ఇచ్చే ఉపాసన.. తాజాగా మెగా మావయ్య గారికోసం అత్తయ్య గారి సూచనలతో ఒక వ్యక్తితో కాఫీని తాయారు చేయించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వివరణ ఇచ్చింది. 
 
సాయంత్రం నాలుగు గంటల సమయంలో కాఫీ తాగితే చాలా మంచిదని నిద్ర కూడా బాగా పడుతుందని వివరించింది. ఇక జిమ్ వర్కౌట్స్ చేసేముందు బ్లాక్ కాఫీ తాగితే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయని సూచనలు కూడా ఇచ్చింది. ఇక కాఫీ మేకింగ్ వీడియోను ఓ లుక్కేయండి.