ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 19 నవంబరు 2017 (12:17 IST)

ఆ ముగ్గురూ ఆ టైపేనా... రాంగోపాల్ వర్మ వివాదాస్పద కామెంట్స్

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, హీరోలు రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లనుద్దేశించి వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన తాజా కామెంట్స్ ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. అంటే, ఈ ముగ్గురూ ఆ టైపేనా (గే) అన

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, హీరోలు రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లనుద్దేశించి వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన తాజా కామెంట్స్ ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. అంటే, ఈ ముగ్గురూ ఆ టైపేనా (గే) అనే అర్థం వచ్చేలా ఆయన కామెంట్ చేశారు. దీంతో ఆ ముగ్గురు అభిమానులు వర్మపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
 
నిజానికి ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద చర్యతో మీడియాలో నానుతుండే వర్మ తాజాగా దర్శకధీరుడు రాజమౌళి పోస్ట్ చేసిన ఓ ఫొటోపై తనకు మాత్రమే సాధ్యమైన కామెంట్స్‌ చేశాడు. మెగాపవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఫొటోను రాజమౌళి సోషల్‌మీడియాలో షేర్ చేశారు.
 
ఆ ఫొటోను వర్మ తన ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తూ "స్త్రీని ఆరాధించేవాడిగా ఉంటూ నేనొక్కటే చెప్పదలుచుకున్నా.. నిస్సిగ్గుగా చేస్తున్న ఈ గే కల్చర్ ప్రచారాన్ని ఖండిస్తున్నా." అంటూ తొలుత ఓ పోస్ట్ పెట్టాడు. మరోసారి అదే ఫొటోను షేర్ చేసి "ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురూ ఆ టైపేనా.. పైగా ముగ్గురూ కూడా పెళ్లయిన వాళ్లు. అల్లా ఏం జరుగుతోంది? జీసస్ దయచేసి మీరైనా నాకు చెప్పండి.. బాలాజీ గారు మీరైనా చెప్పండి" అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశాడు.
 
వర్మ చేసిన ఈ వ్యాఖ్యలపై అటు మెగా ఫ్యాన్స్‌తో పాటు ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా విరుచుకుపడుతున్నారు. ‘నేను బాలాజీని చెబుతున్నాను.. ఈ భూమ్మీద నీకు టైమ్ దగ్గర పడింది ఆర్జీవీ. నువ్వు చనిపోబోతున్నావు’ అంటూ ఓ అభిమాని తన ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌, రాంగోపాల్ వర్మ పరస్పరం ముద్దాడుకుంటున్న ఫొటోను పోస్ట్ చేసి ‘గే కల్చర్ అది కాదు.. ఇది. మీ హ్యాండ్ అన్నింట్లోనూ ఉంటుంది’ అంటూ కామెంట్ చేశాడు.