1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 23-03-2026 Your Daily Horoscope

23-03-2026 సోమవారం దినఫలాలు : సమర్ధతపై నమ్మకం సన్నగిల్లుతుంది...

thularaashi
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అన్ని విధాలా కలిసివచ్చే సమయం. కార్యం సిద్ధిస్తుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. ఆత్మీయులతో సంభాషిస్తారు. కొత్తపరిచయాలేర్పడతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. మితంగా సంభాషించండి. సంతానం దూకుడు అదుపు చేయండి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
లావాదేవీల్లో మెలకువ వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ధైర్యంగా ముందుకు సాగుతారు. శుభకార్యానికి హాజరవుతారు. కానుకలిచ్చిపుచ్చుకుంటారు.
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
రావలసిన ధనాన్ని సామరస్యంగా రాబట్టుకోవాలి. ఖర్చులు విపరీతం. పనులు అర్థాంతంగా నిలిపివేస్తారు. ప్రముఖులను కలిసినా ఫలితం ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. ముఖ్యమైన పత్రాలు సమయానికి కనిపించవు. బెట్టింగ్లకు పాల్పడవద్దు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. కొంతమొత్తం ధనం అందుతుంది. ఇతరుల కోసం ధనం వ్యయం చేస్తారు. ఎబాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఆత్మీయులతో సంభాషిస్తారు. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతికూలతలు అధికం. శ్రమించినా ఫలితం ఉండదు. మీ సమర్ధతపై నమ్మకం సన్నగిల్లుతుంది. చిన్న విషయానికే చికాకుపడతారు. ఓర్పుతో యత్నాలు సాగించండి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది, ఖర్చులు తగ్గించుకుంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూ వీలుపడదు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పాదుపు చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. కొత్తసమస్య ఎదురవుతుంది. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి అపోహ కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఖర్చులు విపరీతం. వాహనం కొనుగోలు చేస్తారు. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు పురమాయించవద్దు. కొందరి అలక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అవకాశాలను వదులుకోవద్దు. ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయం తగదు. పనులు ఒక పట్టాన సాగవు. అనవసర విషయాల్లో జోక్యం తగద అప్రియమైన వార్త వింటారు.. కార్యక్రమాలు వాయిదా పడతాయి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
తలపెట్టిన కార్యం నెరవేరుతుంది, ధైర్యంగా అడుగు ముందుకేస్తారు. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మొండి బాకీలు వసూలవుతాయి. ధనసహాయం తగదు. మీ ఇబ్బందులను సున్నితంగా తెలియజేయండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అనుకూలతలు అంతంత మాత్రమే. తప్పటడుగు వేస్తారు. అనుభవజ్ఞులను సంప్రదించండి. భేషజాలకు పోవద్దు. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. ఖర్చులు విపరీతం. ఆందరితోను ఆచితూచి మాట్లాడండి. నగదు, ఆభరణాలు జాగ్రత్త, బాధ్యతలు అప్పగించవద్దు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీదైన రంగంలో రాణిస్తారు. వస్త్రప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. పనులు సానుకూలమవుతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. సన్నిహితుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. 
తర్వాతి కథనం
22-03-2026 ఆదివారం ఫలితాలు - మీ తప్పిదాలను సరిదిద్దుకునే..?