ఆదివారం, 22 మార్చి 2026
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

21-03-2016 శనివారం ఫలితాలు- చాటుమాటు వ్యాఖ్యలు పట్టించుకోవద్దు

Gossips
Gossips
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఈ పెట్టిన కార్యం సఫలమవుతుంది. మీ సామర్థ్యంపై ఎదుటి వారికి గురి కుదురుతుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. పనులు చురుకుగా సాగుతాయి. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ఆత్మీయులను కలుసుకుంటారు. అందరితోను మితంగా సంభాషించండి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆలోచనలు కార్యరూపం డాబ్బుతాయి. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అనుకూలతలు వున్నాయి. మాట నిలబెట్టుకుంటారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. ప్రముఖులుతో పరిచయాలేర్పడతాయి. పనులు ఒక పట్టాన సాగవు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ప్రయాణం కలిసివస్తుంది. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులు ఫలిస్తాయి. స్థిరాన్ని ధనం అందుతుంది. పనులు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహం కలిగిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
తలపెట్టిన కార్యం సాధిస్తారు. మీ సమర్థతపై సమ్మకం కలుగుతుంది. పనులు సానుకూలమవుతాయి. ఆ బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు. పెద్దల జోక్యంతో  వివాదం సద్దుమణుగుతుంది. నోటీసులు అందుకుంటారు. బెట్టింగ్‌లకు పాల్పడవద్దు.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. కొన్ని విషయాలు అనుకున్నట్లే జరుగుతాయి. కొత్తయత్నాలు చేపడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు, వ్యవహారాలు స్వయంగా చూసుకోంది. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. తల పెట్టిన కార్యం విజయవంతం అవుతుంది. ఖర్చులు సామాన్యం, ధనసహాయం తగదు. పనులు, కార్యక్రమాలు స్వయంగా చూసుకోండి. అప్రమత్తంగా మెలగవలసిన సమయం. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. గుట్టుగా యత్నాలు సాగించండి.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సర్వత్రా అనుకూలం, మొండి బాకీలు వసూలవుతాయి. కొత్తపనులు చేపడతారు. పరిచయస్తుల రాక బబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా పడతాయి. విలువైన వస్తువులు మరమ్మత్తుకు గురవుతాయి. సంతానం చదువులపై దృష్టి పెడతారు. పత్రాలు అందుకుంటారు. 
 
ధనుస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. ఒత్తిడి నుంచి కుదుటపడతారు. కొత్త ఖర్చులు తగ్గించుకుంటారు. పెద్దమొత్తం సాయం తగదు. అర్థాంతంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. నోటీసులు అందుకుంటారు. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
స్థిరాస్తి ధనం అందుతుంది. వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పత్రాల జాగ్రత్త. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. వాయిదా వేడిన పసులు ఎట్టకేలకు పూర్తవుతాయి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. అదనపు బాధ్యతలు చేపట్టి ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1,2,3 పాదాలు
అనుకున్న లక్ష్యం సాధిస్తారు. ప్రశంసలు అందుకుంటారు. మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. చాటుమాటు వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
అవిశ్రాంతగా శ్రమిస్తారు. ఆశించిన అవకాశం చేజారిపోతుంది. అత్యస్థైర్యంతో యత్నించండి. నేడు అనుకూలించనది రేపు ఫలించవచ్చు. ఇతరుల నుంచి సహాయం ఆశించవద్దు. పనుల్లో ఒత్తిడి అధికం, ముఖ్యుల కలయిక వీలుపడదు. మొండి ధైర్యంతో ముందుకు సాగుతారు.