1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
  4. Benefits and uses of Radish

ముల్లంగి రసాన్ని తరుచుగా ఆహారంలో చేర్చుకుంటే?

ముల్లంగి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ముల్లంగి ఆకులను, దుంపలను ఎండబెట్టుకుని మెత్తగా దంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని తేనెలో కలుపుకుని ప్రతిరోజూ తీసుకుంటే శరీరంలోని వాపులు, నొప్పులు వంటి సమస్యల నుండి ఉ

radish
ముల్లంగి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ముల్లంగి ఆకులను, దుంపలను ఎండబెట్టుకుని మెత్తగా దంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని తేనెలో కలుపుకుని ప్రతిరోజూ తీసుకుంటే శరీరంలోని వాపులు, నొప్పులు వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చును. పచ్చి ముల్లంగి దుంపలు లేదా దాని ఆకులను రసంగా చేసుకుని తీసుకుంటే  విరేచననాలకు మంచిగా ఉపయోగపడుతుంది.
 
ముల్లంగి విత్తులను బాగా ఎండబెట్టుకుని పొడి చేసుకోవాలి. ఈ పొడిని ప్రతిరోజూ అన్నంలో కలుపుకుని తీసుకుంటే స్త్రీలలో రుతు సంబంధ వ్యాధుల నుండి విముక్తి చెందవచ్చును. ఆగకుండా వెక్కిళ్లు వస్తున్నప్పుడు కొద్దిగా ముల్లంగి రసాన్ని తాగితే వెంటనే తగ్గిపోతాయి. విపరీతమైన జలుబు, దగ్గు, ఆయాసంతో బాధపడుతున్న వారికి ముల్లంగి రసం దివ్యౌషధంగా పనిచేస్తుంది. 
 
మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించడంలో ముల్లంగి ఎంతో దోహదపడుతుంది. ఈ ముల్లంగి ఆకులను తరచుగా ఆహారంలో చేర్చుకుంటే అస్సలు రాళ్లు ఏర్పడే అవకాశామే ఉండదు. ఈ ముల్లంగి రసంలో కొద్దిగా నువ్వుల నూనెను కలుపుకుని వడబోసి ఒక డబ్బాలో నిల్వచేసుకోవాలి. ఈ ముల్లంగి నూనె మంచి ఔషధంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
అప్పుడప్పుడు కొంతమందికి చెవిపోటు వస్తుంటుంది. అటువంటి వారు ఈ ముల్లంగి నూనెను చెవిలో వేసుకుంటే వెంటనే మంచి ఫలితాలను పొందవచ్చును. అంతేకాకుండా కీళ్లనొప్పులు ఉన్నచోట కూడా ఈ నూనెతో మర్దన చేసుకుంటే ఇలాంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. 
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
పెరుగు ఆరోగ్యానికే కాదు... అందానికి కూడా...