మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By chj
Last Modified: బుధవారం, 1 ఆగస్టు 2018 (20:41 IST)

పెరుగు ఆరోగ్యానికే కాదు... అందానికి కూడా...

పెరుగు గురించి తెలియని భారతీయులు ఉండరు. ఎందుకంటే ఇది చేసే మేలు ఇంతా అంతా కాదు. దీనిని ప్రతిరోజు ఆహారంలో ఉపయోగించటం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అందటమే కాకుండా ఇది శరీర ఉష్ణోగ్రతను కూడా క్రమబద్దీకరిస్తుంది. దీనిని కేవలం ఆరోగ్యపరంగా మాత్రమే కాకుండా

పెరుగు గురించి తెలియని భారతీయులు ఉండరు. ఎందుకంటే ఇది చేసే మేలు ఇంతా అంతా కాదు. దీనిని ప్రతిరోజు ఆహారంలో ఉపయోగించటం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అందటమే కాకుండా ఇది శరీర ఉష్ణోగ్రతను కూడా క్రమబద్దీకరిస్తుంది. దీనిని కేవలం ఆరోగ్యపరంగా మాత్రమే కాకుండా సౌందర్యలేపనంగా కూడా ఉపయోగించవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
 
1. పెరుగులో ల్యాక్టిక్ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేడ్ చేయడంలో ముఖ్యపాత్ర వహిస్తాయి. ఇది ముఖాన్ని తెల్లగా, మృదువుగా మార్చటంలో సహాయపడుతుంది. పెరుగులో కొద్దిగా బియ్యపు పిండిని కలిపి ముఖానికి రాసుకొని 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. బియ్యపు పిండిలో యాంటీఏజింగ్ గుణాలు అధికంగా ఉండటం వల్ల ఇది చర్మంపై ఉన్న ముడతలను తగ్గించి మృదువుగా, కాంతివంతంగా మారుస్తుంది. దీనిని వారానికి మూడుసార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
 
2. ఒక టీ స్పూన్ పెరుగులో రెండు టీ స్పూన్ల కలబంద గుజ్జుని కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న మృతకణాలు తొలగిపోయి ముఖం తాజాగా కనిపిస్తుంది.
 
3. రెండు టీ స్పూన్ల పెరుగులో ఒక టీ స్పూన్ టమోటా రసం, ఒక టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి మర్దన చేసి పావుగంట తర్వాత కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల ముఖం తెల్లగా, అందంగా మారుతుంది.
 
4. పెరుగులో కొద్దిగా శనగపిండి, చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాసుకొని అరగంట తర్వాత కడిగేయాలి. ఇందులో ఉండే విటమిన్స్ ప్రోటీన్స్ ముఖాన్ని మెరిసిపోయేలా, కాంతివంతంగా చేస్తాయి.
 
5. పెరుగులో కొన్ని కీరదోస ముక్కల్ని వేసి ఫేస్టులా చేయాలి. దీనిని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది చర్మంపై ఉన్న మచ్చలను తొలగించి ముఖానికి మంచి అందాన్ని ఇస్తుంది.