సంబంధిత వార్తలు
- సన్నిహిత వీడియోలు నా దగ్గరున్నాయి, నన్ను పెళ్లిచేసుకుంటే సరే, లేదంటే...
- #AzimMansooriకి వధువు కుదిరిందోచ్.. 2.5 ఫీట్లు అబ్బాయికి బుస్రాతో పెళ్లి
- అన్నతో పెళ్లి చూపులు.. తమ్ముడుతో నిశ్చితార్థం : జీర్ణించుకోలేక...
- 'గే' పెళ్లిళ్లతో కరోనావైరస్ పుట్టింది, ఎవరు?
- పెళ్లి పేరుతో అత్యాచారానికి పాల్పడ్డాడు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడిపై కేసు
మీకు అర్థమవుతుందా? ఆయుష్షు పెరగాలంటే పెళ్లి చేసుకోండి
పెళ్లి చేసుకుంటే ఆయుష్షు పెరుగుతుందంట. గుండెకు సంబంధించిన రోగాలు రావంట. ఒంటరిగా ఉంటున్న వాళ్లతో పోల్చితే వివాహితులు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని.. ఆరోగ్యకరంగా జీవించేందుకు పెళ్లి ఓ చక్కని మార్గమని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ విషయంపై బ్రిటన్‌లో 10 లక్షల మందిపై అధ్యయనం జరిగింది. వారంతా అధిక రక్తపోటు.. డయాబెటిస్ వంటి రుగ్మతలతో బాధపడుతున్నవారే. వీళ్లలో ఒంటరిగా ఉంటున్న వారికంటే పెళ్లైన వారు ఎక్కువ సంతోషంగా గడుపుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన వారిలోనూ.. వివాహితులు తొందరగా కోలుకుంటున్నారని తేలింది.
ముఖ్యంగా గుండెపోటుకు దారితీసే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ నియంత్రణకు వివాహం మంచి మందులా పనిచేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 50 నుంచి 70 ఏళ్ల వయసున్న వారిని పరిశీలిస్తే.. అవివాహితుల కంటే వివాహితులు 16శాతం ఎక్కువ కాలం బతుకుతున్నారని ఈ అధ్యయనంలో తేలింది.
వివాహంతో పాటు ఫ్యామిలీ, ఫ్రెండ్‌షిప్, సామాజిక బంధుత్వాలు కూడా ఆరోగ్యంగా జీవించేందుకు ఎంతో ఉపయోగపడతాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే.. పెళ్లై విడిపోయిన, భాగస్వామిని కోల్పోయి ఒంటరిగా ఉంటున్న వారి విషయంలో మాత్రం పరిశోధకులు ఓ స్పష్టతకు రాలేదు.
