మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (14:46 IST)

#AzimMansooriకి వధువు కుదిరిందోచ్.. 2.5 ఫీట్లు అబ్బాయికి బుస్రాతో పెళ్లి

Azim Mansoori
మరుగుజ్జు అజీమ్ మన్సూరీ పెళ్లి చేసుకోనున్నాడు. మాన్సూరీ 5వ తరగతి డ్రాపౌట్‌. అతను కాస్మటిక్ స్టోర్‌ను నడిపిస్తున్నాడు. మరుగుజ్జు కావడం వల్ల జీవితభాగస్వామి దొరకడం లేదని పోలీసుల్ని ఆశ్రయించాడు. 2019లో యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్‌ను కూడా అతను కలిశాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఆయనకు ఆఫర్స్ రావడం మొదలుపెట్టాయి. 
 
ఇలా తనకు వధువును వెతికి పెట్టాలంటూ ఐదేళ్ల క్రితం అతను చేసిన అభ్యర్థన ఇప్పుడు నెరవేరింది. ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాకు చెందిన అజీమ్ మన్సూరీ ఎత్తు 2.5 ఫీట్లు. కైరానా గ్రామానికి చెందిన అతను.. అయిదేళ్ల క్రితం తనకు వధువును వెతికిపెట్టాలంటూ పోలీసుల్ని కోరారు. దాంతో ఆ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ మరుగుజ్జు మన్సూరీకి ఇప్పుడు వధువు దొరికింది. 
 
హాపుర్‌లోని బుస్రాను అతని పెళ్లి చేసుకోనున్నాడు. మరుగుజ్జు మన్సూరీకి తగినట్లుగా మరుగుజ్జు బుస్రా ఉంది. హాపుర్‌లో ఉన్న బుస్రా ఇంటికి వెళ్లిన మన్సూరీ.. ఒక గోల్డ్ రింగ్‌ను, 2100 నగదును ఇచ్చాడు. ఇక బుస్రా ఫ్యామిలీ కూడా మన్సూరీకి గొల్డ్ రింగ్‌తో పాటు 3100 క్యాష్‌ను ఇచ్చారు.