మంగళవారం, 27 ఫిబ్రవరి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 మార్చి 2021 (20:21 IST)

జెర్సీని డిజైన్ చేసుకోవ‌డం కూడా చేత‌కాద‌ు.. వీళ్లేం ఆడుతారో..?

Punjab Kings
ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 14వ సీజన్.. ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానుంది. తాజాగా పంజాబ్ కింగ్స్ టీమ్ తాజాగా త‌మ జ‌ట్టుకు చెందిన ఆట‌గాళ్ల కొత్త జెర్సీని ఆవిష్క‌రించింది. కానీ ఆ జెర్సీ గురించి నెటిజ‌న్లు ఆ టీమ్‌ను ట్రోల్ చేస్తున్నారు. 
 
పంజాబ్ కింగ్స్ టీమ్ కొత్త‌గా ఆవిష్క‌రించిన త‌మ ప్లేయ‌ర్ల జెర్సీ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) జ‌ట్టు పాత జెర్సీని పోలి ఉంది. దీంతో ఆర్‌సీబీ ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. పంజాబ్ టీమ్‌కు జెర్సీని డిజైన్ చేసుకోవ‌డం కూడా చేత‌కాద‌ని, ఇక ఐపీఎల్‌లో ఏం ఆడ‌తారు..? అని మండిప‌డుతున్నారు. 
 
కాగా పంజాబ్ కింగ్స్ టీమ్ ఇటీవ‌లే త‌మ జ‌ట్టు పేరుతోపాటు లోగోను కూడా మార్చింది. కానీ కొత్త జెర్సీ ఆర్‌సీబీ జ‌ట్టు పాత జెర్సీని పోలి ఉండ‌డంతో ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.