శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 29 మార్చి 2021 (22:04 IST)

నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య, కారణం...?

ట్రిపుల్ ఐటీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలోని శ్రీకాకుళం క్యాంపస్‌కు చెందిన 20 ఏళ్ల మాధురి వసతిగృహంలో తను వుంటున్న గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె స్వస్థలం కాకినాడ గాంధీనగర్ లోని గొల్లపేట.
 
తోటి విద్యార్థునులు భోజనం చేసేందుకు వెళ్లగానే ఆమె గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని పోలీసులకు తెలిపింది కాలేజీ యాజమాన్యం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసారు. ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది.