శనివారం, 9 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 డిశెంబరు 2020 (16:58 IST)

లెనోవా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్... ధర ఎంతంటే..?

లెనోవా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లో విడుదలైంది. లెనోవా కే 12, లెనోవా కే 12 ప్రో పేరుతో మోటో ఈ 7 ప్లస్, మోటో జీ9 పవర్‌ ఫోన్లకు రీబ్రాండెడ్ వెర్షన్లుగా చైనాలో తీసుకొచ్చింది.

రెండు ఫోన్లలోనూ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌లను పొందుపర్చింది. వీటిలో లెనోవో కే 12 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ  స్టోరేజ్ ధర సుమారు రూ. 9,000 ఇది గ్రేడియంట్ బ్లూ మరియు గ్రేడియంట్ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 
 
అలాగే లెనోవా కె 12 ప్రో 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర సుమారు రూ. 11,300. ఇది పర్పుల్, గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

రెండు ఫోన్లు ప్రస్తుతం చైనాలో ప్రీ-సేల్ కోసం సిద్ధంగా ఉండగా, డిసెంబర్ 12 నుండి  అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఇండియా తదితర మార్కెట్లో ఇవి ఎపుడు లభ్యమయ్యేది కంపెనీ ఇంకా వెల్లడించలేదు.