శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 డిశెంబరు 2020 (16:08 IST)

ఫ్లిఫ్ కార్ట్ శుభవార్త.. నిరుద్యోగులకు హ్యాపీ.. మహిళా ఇంజనీర్లకు సూపర్ ఛాన్స్

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిఫ్ కార్ట్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. సాఫ్ట్ వేర్ డవలప్మెంట్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, బిజినెస్ అనలిస్ట్స్, ప్రొడక్ట్ మేనేజర్స్, ప్రొడక్ట్ డిజైనర్స్ తదితర విభాగాల్లో నియామకాలు చేపట్టనున్నారు. మహిళా ఇంజనీర్ల నియామకాల కోసం ఫ్లిప్ కార్ట్ 'గర్ల్ వన్నా కోడ్' పేరుతో ప్రత్యేక ప్రోగ్రామ్ నిర్వహిస్తుంది.
 
ఇంకా ప్రముఖ కాలేజీల నుంచి దాదాపు 300 మంది విద్యార్థులకు తమ సంస్థలో ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపింది. ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) లాంటి ప్రముఖ విద్యాసంస్థల్లో ఈ నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది. 
 
ఈ కంపెనీ గతేడాదితో పోల్చితే 30 శాతం అధికంగా నియామకాలు చేపట్టింది. టెక్నికల్, నాన్ టెక్నికల్ రంగాల్లోనూ ఈ నియామకాలు జరిగాయి. ప్రస్తుతం తాము 300 మందిని నూతనంగా నియమించుకోనున్నట్లు ఫ్లిఫ్ కార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ కృష్ణ రాఘవన్ తెలిపారు. వారు వచ్చే ఏడాది 2021లో విధుల్లో చేరుతారన్నారు. ఇందుల్లో 180 మంది ఇంజనీర్లు ఉంటారని తెలిపారు.