గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2020 (19:46 IST)

బిగ్ సేవింగ్స్ డేస్ పేరిట ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్స్.. మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లు

Flipkart
పంద్రాగస్టు సందర్భంగా ప్రత్యేక సేల్‌ను ప్రకటిస్తున్నాయి ఈ-కామర్స్ సంస్థలు. ఇందులో భాగంగా బిగ్ సేవింగ్స్ డేస్ పేరిట ఫ్లిప్‌కార్ట్ సంస్థ ఐదు రోజుల పాటు ఆఫర్స్ ప్రకటించింది. ఆగస్టు 6 నుంచి 10 వరకు ఈ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్‌ని నిర్వహించనున్నారు. ఇందులో మొబైల్ ఫోన్స్ సహా అన్ని రకాల ఉత్పత్తులపై భారీగా డిస్కౌంట్స్ ఇస్తున్నారు.
 
బిగ్ సేవింగ్స్ డేస్‌లో ఎలాంటి ఆఫర్లు ఉండబోతున్నాయని పలు వివరాలను ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. ఐఫోన్ ఎక్స్ఆర్, ఒప్పో రెనో 2ఎఫ్, ఐఫోన్ ఎస్ఈ, రెడ్‌మి కే20 సహా పలు మొబైల్స్‌పై ఆకర్షణీయ ఆఫర్లు అందించున్నట్లు తెలిపింది.
 
మొబైల్స్‌పైన ఫ్లిఫ్ కార్ట్ ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఇస్తోంది. అంతేకాకుండా నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సిటీ బ్యాంగ్ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్స్‌ కొనుగోలు చేస్తే 10శాతం అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది.