ఫ్లిఫ్ కార్ట్‌లో 24.9 బిలియన్ డాలర్లు పెట్టుబడి.. వాల్ మార్ట్ అదుర్స్
2018లో 16 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఫ్లిప్‌కార్ట్‌లో 70 శాతం వాటాలను వాల్ మార్ట్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రముఖ స్టార్టప్ సంస్థగా ఉన్న ఫ్లిప్ కార్ట్, ఆపై ఇండియాలో అమేజాన్‌కు గట్టిపోటీ ఇచ్చే స్థాయికి చేరుకుంది. వాల్ మార్ట్ సంస్థ మరో 1.2 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టనుంది.
ఇప్పటికే ఫ్లిఫ్ కార్టులో పలు దఫాలుగా పెట్టుబడి పెట్టిన వాల్ మార్ట్ మెజారిటీ వాటాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్, ఈ పెట్టుబడితో సంస్థ విలువ 24.9 బిలియన్ డాలర్లకు చేరుకుందని తెలిపింది. 2021 ఆర్థిక సంవత్సరంలో రెండు దఫాలుగా, ఈ పెట్టుబడి సంస్థకు రానుందని ఫ్లిప్ కార్ట్ పేర్కొంది.
ఈ నిధులతో తమ విస్తరణ, అభివృద్ధి ప్రణాళికలను కొనసాగిస్తామని, కరోనా కష్టాల నేపథ్యంలో ఈ-కామర్స్ మార్కెట్ ప్లేస్ భారత్‌లో నానాటికీ విస్తరిస్తున్న వేళ, మరింత మార్కెట్ వాటాను సాధించేందుకు కృషి చేస్తామని తెలిపింది.