గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 జులై 2020 (13:59 IST)

ప్రపంచ సహజ వనరుల పరిరక్షణ దినోత్సవం.. మహేష్ బాబు సందేశం

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రపంచ సహజ వనరుల పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓ సామాజిక సందేశం పంచుకున్నారు. ట్విట్టర్ ద్వారా నీటిని కాపాడుదాం.. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దామని పిలుపునిచ్చారు.

వ్యర్థాలను ఉపయోగిద్దాం, పునరుత్పాదక శక్తిని వాడుకుందాం. ఈ సంక్షోభ సమయంలో మనం మనల్ని మనం రక్షించుకుంటూనే, ప్రకృతిని కూడా పరిరక్షించడం గుర్తుంచుకోవాలని చెప్పారు. మార్పు మన ఇంటి నుండే మొదలు కావాలి అని మహేష్ తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
 
ఇకపోతే.. నేడు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్స‌వం. సహజ వనరులను పరిరక్షించేందుకు ఉత్తమమైన పద్ధతుల గురించి అవగాహన కల్పించడానికి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడింది. భూమిపై ప‌రిమిత వ‌న‌రులు ఉన్నందున సమతుల్యతను కాపాడుకోవడానికి వాటిని సమర్థవంతంగా ఉపయోగించాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను తెలియ‌జేస్తుంది. 
 
జ‌నాభా విస్పోట‌నం సహజ వనరులు చాలా వేగంగా క్షీణించటానికి ఓ ప్రధాన కారణం ఉంది. సాంకేతిక పురోగతి, విలాసవంతమైన జీవనశైలి, గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ పొర క్షీణత, ఇటీవ‌లి కాలంలో అమెజాన్ అడ‌వుల్లో చెల‌రేగిన మంట‌లు వంటివి పర్యావరణ సమస్యలను లేవనెత్తుతున్నాయి. భ‌విష్య‌త్తులో బాధ‌ప‌డ‌కుండా ఉండాలంటే ప్ర‌కృతి స‌మ‌తుల్య‌త కోసం వీటిని పాటించాల్సి వుంది.