గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 జులై 2020 (20:37 IST)

సర్కారు వారి పాట కోసం పక్కాగా ప్లాన్.. వ్యాక్సిన్ వచ్చాక..?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు దూకుడు కొనసాగుతోంది. తాజాగా ప్రిన్స్ నటిస్తున్న సినిమా సర్కారు వారిపాట. ఈ చిత్రానికి బుజ్జి దర్శకుడు. కీర్తిసురేష్‌ నాయిక. జీఎం ప్రొడక్షన్స్‌, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రొడక్షన్‌ను పక్కాగా ప్లాన్‌ చేస్తున్నారు దర్శక, నిర్మాతలు.
 
సినిమాలు వేగంగా తీసే దర్శకుడిగా పేరున్న పూరి జగన్నాథ్‌కు వరుసకు సోదరుడు, శిష్యుడైన పరశురామ్‌ కెరీర్‌ తొలి నుంచి పూరి అడుగుజాడల్లోనే తక్కువ వ్యయంతో, తక్కువ వర్కింగ్‌డేస్‌తో సినిమాలు తీసేవాడు. 
 
ఆ తరహాలోనే దేశం కరోనా ఫ్రీ అవ్వగానే, లేదా వ్యాక్సిన్‌ మార్కెట్లోకి రాగానే ఈ చిత్రం షూటింగ్‌ను కూడా వీలున్నంత తక్కువ డేస్‌లో, బడ్జెట్లో తీసి నిర్మాతలకు లాభాలు వచ్చేలా చేయడానికి పరశురామ్‌ ప్లాన్‌ చేసుకుంటున్నాడు.