గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్

'తొలిప్రేమ' రోజున వస్తున్న 'పవర్ స్టార్'

తెలుగు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న తాజా చిత్రం పవర్ స్టార్. పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేరెత్తకుండానే ఆయన జీవిత చరిత్రలో ఓ భాగాన్ని ఆధారంగా చేసుకుని సినిమాను నిర్మిస్తున్న విషయం తెల్సిందే. 
 
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పలు అప్ డేట్లను, షూటింగ్ చిత్రాలను ఆయన విడుదల చేశారు. ఇక, ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్న ఆయన, సినిమా విడుదల తేదీపైనా ఓ నిర్ణయానికి వచ్చేశారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
 
పవన్ కల్యాణ్ నటించిన 'అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి', 'గోకులంలో సీత' వంటి సినిమాల తరువాత తొలి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి, పవన్ స్టామినాను ఫ్యాన్స్‌కు తెలిపిన 'తొలిప్రేమ' చిత్రం విడుదలైన జూలై 24నే తాను నిర్మిస్తున్న 'పవర్ స్టార్'ను విడుదల చేయాలని వర్మ భావిస్తున్నారట. ఈ విషయంలో అధికారిక ప్రకటన ఏదీ వర్మ నుంచి వెలువడలేదు.