గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 జులై 2020 (21:39 IST)

టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న 'బుట్టబొమ్మ' (video)

తెలుగు చిత్ర పరిశ్రమలో అల.. వైకుంఠపురములోని బుట్టబొమ్మ పాట సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ముఖ్యంగా యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలోనే అత్యధిక మంది నెటిజన్లు వీక్షించిన పాటగా రికార్డుపుటలకెక్కింది. 
 
ఇప్పటివరకు ఈ తరహాలో ఏ చిత్రంలోని పాటను కూడా నెటిజన్లు చూడలేదు. సెలెబ్రిటీల నుంచి చంటిబిడ్డల వరకు ఈ పాటను ఇష్టపడుతూ యూట్యూబ్‌లో వీక్షిస్తున్నారు. ఫలితంగా ఈ పాటను ఇప్పటివరకు 261,146,585 వీక్షించారు. అలాగే, 1.9 మిలియన్ల మంది ఈ పాటను లైక్ చేయగా, 190 వేల మంది డిజ్‍లైక్ చేశారు. 
 
కాగా, గత సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించింది. అల్లు అర్జున్ - పూజా హెగ్డే నటించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనవాస్ దర్శకత్వం వహించగా ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, రాధాకృష్ణలు కలిసి నిర్మించారు. ఈ పాటను ఆర్మాన్ మాలిక్ పాడగా, థమన్ సంగీత బాణీలు సమకూర్చారు.