గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 జులై 2020 (15:18 IST)

బుట్టబొమ్మ రికార్డు.. 250 మిలియన్ వ్యూస్‌.. (video)

butta bomma
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం అల వైకుంఠపురంలో. ఈ సినిమాలోని బుట్టబొమ్మ సాంగ్ మాత్రమే కాకుండా అన్నీ పాటలు హిట్ట్ అయ్యాయి. అల వైకుంఠపురములో చిత్రం కోసం థమన్ అద్భుతమైన బాణీలు స్వరపరచారు. ముఖ్యంగా 'సామజవరగమన', 'రాములో రాములా', 'ఓ మై గాడ్‌ డాడీ', బుట్ట బొమ్మ సాంగ్స్ సినిమా రిలీజ్‌కి ముందే ఓ ఊపు ఊపాయి. అయితే 'బుట్ట బొమ్మ' సాంగ్ మాత్రం ప్రపంచ వ్యాప్తంగా దుమ్ము రేపుతుంది. 
 
తాజాగా బుట్టబొమ్మ పాట ఖాతాలో కొత్త రికార్డు నమోదైంది.'బుట్టబొమ్మ' సాంగ్ ప్రపంచ రికార్డ్ సాధించగా, ''వరల్డ్ వైడ్‌గా అత్యంత ప్రాచుర్యం పొందిన 100 వీడియో సాంగ్స్‌లో ఈ పాట 15వ స్థానంలో నిలిచింది. ఫిబ్రవరి 25న విడుదలైన బుట్టబొమ్మ వీడియో సాంగ్‌ని యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగా ప్రస్తుతం ఈ సాంగ్ 250 మిలియన్స్‌కి పైగా వ్యూస్ రాబట్టి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ పాట 2 మిలియన్ లైక్స్ మార్కుకు దగ్గరగా ఉంది
 
ఇకపోతే.. బుట్టబొమ్మ అంటూ సాగే ఈ పాటను అర్మాన్‌ మాలిక్‌ ఆలపించాడు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా తమన్‌ స్వరాలు సమకూర్చారు. ఈ సాంగ్ కి సంబంధించిన కొరియోగ్రఫీకి కూడా యూత్ ఫుల్ ఫిదా అయ్యారు. మనదేశంలోనే కాక విదేశాలలోను బుట్టబొమ్మ సాంగ్‌కి తెగ డ్యాన్స్‌లు చేస్తున్నారు.