కేబీఆర్ పార్కులో స్నేహతో అల్లు అర్జున్
లాక్డౌన్ కారణంగా సినీ సెలెబ్రిటీలు తమతమ ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం అపుడపుడూ కెమెరా కంటికి చిక్కుతున్నారు. రోడ్లపై వాకింగ్ చేస్తూ, సూపర్ మార్కెట్‌కు వెళుతూ ఇలా ఏదో ఒక సందర్భంలో కంటికి కనిపిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో వీవీఐపీలు వాకింగ్ చేసే కేబీఆర్ పార్కులో తన భార్యతో కలిసి కనిపించాడు.
తాజాగా, ఆయనకు సంబంధించిన మరికొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. మాసిన గడ్డంతో అల్లు అర్జున్ ఇందులో కొత్త లుక్‌లో కనపడ్డాడు. తాజాగా ఆయన జూబ్లిహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద జాగింగ్ చేశాడు. తన భార్య స్నేహా రెడ్డితో కలిసి ఆయన శుక్రవారం ఉదయం వాకింగ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగానే అవి వైరల్ అయ్యాయి.