సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 జనవరి 2020 (12:08 IST)

అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్.. ఒక్క వారం ఆగండి.. ఆఫర్లే ఆఫర్లు

సంక్రాంతి పండుగకు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. అంతేగాకుండా ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు కొనాలనుకుంటున్నారా.. అయితే అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ కోసం వేచి చూడండి.

ఈ ఏడాది అమేజాన్ నిర్వహించబోతున్న మొదటి గ్రేట్ ఇండియన్ సేల్ ఇదే కావడం గమనార్హం. ఈ సేల్ జనవరి 19 నుంచి 22 వరకు అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ జరుగనుంది. అమేజాన్ ప్రైమ్ కస్టమర్లకు ఈ ఆఫర్లు ఒక రోజు ముందే ప్రారంభం అవుతుంది. 
 
స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ వేర్, ఫర్నీచర్ ఇలా అన్ని కేటగిరీల్లో ఆఫర్లను ప్రకటించింది అమేజాన్. షావోమీ, రియల్‌మీ, ఒప్పో, సాంసంగ్, వివో స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్స్ ఉంటాయి. అంతే కాదు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) క్రెడిట్ కార్డులతో కొనేవారికి పది శాతం అదనంగా తగ్గింపు లభిస్తుంది.

నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉంటాయి. అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌లో ఐఫోన్ ఎక్స్ఆర్, రెడ్‌మీ నోట్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్లు తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి.