గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 నవంబరు 2019 (13:31 IST)

హానర్ 20 ఐ ధర తగ్గిందోచ్.. త్వరపడండి..

హానర్ బ్రాండ్ తన 20ఐ స్మార్ట్ ఫోన్ ధరను భారీగా తగ్గించేసింది. ఈ మేరకు హానర్ 20ఐ ధరను తగ్గిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. హువాయ్ సంస్థకు చెందిన హానర్ బ్రాండ్ నుంచి గత ఏడాది జూన్ నెల హానర్ 20ఐ స్మార్ట్ ఫోన్లు భారత్‌లో విడుదల అయ్యాయి. దీని ధర రూ.14.999. 
 
ప్రస్తుతం ఈ రేటు పడిపోయింది. స్వల్ప కాలిక గడువుతో హానర్ 20ఐపై ధరల తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించారు. దీని ప్రకారం హానర్ 20 ఐ 4 జీబీ రామ్, 128 జీబీ మెమొరీ మోడల్ రూ.10.999లకు తగ్గించడం జరిగింది. ఈ ఆఫర్ నవంబర్ 30వ తేదీ వరకే వుంటుంది.  
 
ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల సంగతికి వస్తే.. 
6.21 ఇంచ్ FHD+ ప్లస్ డిస్‌ప్లే, గ్రీన్ 710 బ్రాజర్ 
ఆండ్రాయిడ్ 9 బై, EMUI 9.0, 4 జీబీ  రామ్ 
 
24 ఎంబీ ప్రైమరీ కెమెరా, 2 ఎంబీ రెండో ప్రైమరీ కెమెరా, 8 ఎంబీల 120° అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్
32 ఎంబీల ఫ్రంట్ సెల్ఫీ కెమెరా, 3400 మెగా హెడ్జ్ బ్యాటరీని కలిగివుంటుంది.