శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 నవంబరు 2019 (17:04 IST)

రియల్‌ మీ నుంచి ఎక్స్ 2 ప్రో స్మార్ట్ ఫోన్..

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ రియల్‌ మీ నుంచి రియల్‌ ఎక్స్‌ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది. అధునాతన ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో కస్టమర్లకు అందుబాటులో వుంటుంది. ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మి ఆన్‌లైన్‌ స్టోర్ల ద్వారా ఈ నెల 26నుంచి అందుబాటులోకి రానున్నాయి. 
 
ఫీచర్స్.. ధరల సంగతికి వస్తే..
స్టార్టింగ్ వేరియంట్ 8 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999
హై ఎండ్ వేరియంట్ 12 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999 ఉండగా మాస్టర్‌ ఎడిషన్​ 12 జీబీ ర్యామ్, 256 జీబీ వేరియంట్ ధర రూ.34, 999గా నిర్ణయించారు. 
 
అలాగే రియల్‌ మి ఎక్స్‌ 2 ప్రో ఫీచర్ల విషయానికి వస్తే.. 6.50 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 + ప్రాసెసర్, ఆండ్రాయిడ్‌ 9పై, 1080 x 2400 పిక్సె ల్స్‌ రిజల్యూషన్‌, 8జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజీ అమర్చినట్టు తెలుస్తోంది.