శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 డిశెంబరు 2020 (16:05 IST)

గూగుల్ పే.. యువ వ్యాపారికి లక్ష రూపాయల రివార్డ్..

గూగూల్ పే ద్వారా ఓ యువ వ్యాపారికి లక్ష రూపాయల రివార్డ్ వచ్చింది. గూగుల్ పే ద్వారా లావాదేవిలు నిర్వహించిన ఓ యువ వ్యాపారికి లక్ష రూపాయల రివార్డ్ వచ్చింది. నిజామాబాద్ నగరానికి చెందిన నాగమల్ల సంపత్‌కి ఖలీల్ వాడి ప్రాంతంలో సౌమ్య కిరాణ అండ్ జనరల్ స్టొర్ ఉంది. తన దుకాణానికి సంబంధించిన లావాదేవిల కోసం ఏడు నెలల క్రితం గూగూప్ పే బిజినెస్ యాప్‌ని వాడుతున్నాడు. 
 
ఈ అకౌంట్ ద్వారా లావాదేవిలి నిర్వహిస్తున్నాడు. కస్టమర్లు సైతం ఇదె నంబరుకి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేస్తుంటారు. ఈ బిజినెస్ అకౌంట్ వాడుతున్న వారికి వారానికి ఒక రోజు బిజినెస్ స్క్రాచ్ కార్డు వస్తుంది. ఓపెన్ చేసి చూడగా రూ. లక్ష రివార్డ్‌గా వచ్చాయి. ఎప్పుడు రూ.20-30 వచ్చేవని ఈ సారి లక్ష రూపాయలు రావటం ఆనందంగా ఉందని అంటున్నాడు సంపత్. తాను మొదట నమ్మలేదని అయితే అకౌంట్ చెక్ చేయగా ఖాతాలో డబ్బు జమ అయిందని తెలిపాడు.