సంబంధిత వార్తలు
- ఫ్లిఫ్ కార్ట్ శుభవార్త.. నిరుద్యోగులకు హ్యాపీ.. మహిళా ఇంజనీర్లకు సూపర్ ఛాన్స్
- మోటోరోలా మోటో జీ5జీ స్మార్ట్ ఫోన్.. ఫ్లిఫ్ కార్ట్‌లో సేల్ ప్రారంభం
- మీ పోరాటానికి సెల్యూట్ : టీబీజేపీ నేతలకు మోడీ - షా అభినందనలు
- షియోమీకి షాక్.. దిగుమతిని ఆపండి.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
- రెడ్ మీ నుంచి 5జీ స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ సంగతేటంటే?
ఐటెల్ నుంచి కొత్త ఫీచర్.. ధర: రూ.1.049.. టెంపరేచర్‌ను అలా గుర్తించేలా..?
Itel
ఇన్‌బిల్ట్ టెంపరేచర్ సెన్సర్ ద్వారా శరీర ఉష్ణోగ్రతను మానిటర్ చేస్తుందని కంపెనీ వెల్లడించింది. దీన్ని ఫారెన్‌హీట్‌గా కూడా మార్చవచ్చు. అంతేకాదు టెక్స్ట్-టు-స్పీచ్ ఫీచర్ ద్వారా ఇన్‌కమింగ్ కాల్‌లు, సందేశాలు, మెనూ వివరాలు మాత్రమే కాకుండా బాడీ టెంపరేచర్ వివరాలను కూడా వినిపిస్తుంది.
కోవిడ్ -19 నుండి సురక్షితంగా ఉండటానికి ముందస్తు చర్యగా యూజర్ల శరీర ఉష్ణోగ్రతను ట్రాక్ చేసేలా ఎంట్రీ లెవల్ దేశంలోనే తొలి ఫీచర్ ఫోన్‌గా ఇది నిలిచింది. అలాగే టెక్స్ట్-టు-స్పీచ్ ఫీచర్ ఇందులోని మరో విశేషం.
యూజర్లు టెంపరేచర్‌ను గుర్తించేలా ఫోన్‌లో థర్మో సెన్సార్‌ను పొందుపర్చింది. థర్మో బటన్‌ను ఎక్కువసేపు నొక్కి ఉంచితే టెంపరేచర్‌ను రీడ్ చేస్తుంది. సెన్సార్‌ను అరచేతిలో ఉంచుకోవడం లేదా సెన్సార్‌పై టచ్ ఫింగర్‌ను ఉంచితే సెల్సియస్‌లో టెంపరేచర్‌ను చూపిస్తుంది.
