గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 డిశెంబరు 2020 (14:59 IST)

భార్యాభర్తల మధ్య చిచ్చు.. ట్రిపుల్ తలాక్ రద్దు చేసి.. విడాకులతో తెంపుకొమ్మంటారా?

Sujata Mondal
పశ్చిమ బెంగాల్‌ అధికార తృణమూల్‌, బీజేపీల మధ్య ఏర్పడిన వైరం... భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టింది. భార్య సుజాత మండల్‌ తృణమూల్‌లో చేరిందన్న నెపంతో బీజేపీ ఎంపి సౌమిత్రా ఖాన్‌ ఆమెకు విడాకుల నోటీసులు పంపారు. కాగా, దీనిపై సుజాత ఘాటుగా స్పందించారు. ట్రిపుల్‌ తలాక్‌ను రద్దు చేసిన పార్టీ తమ వైవాహిక బంధాన్ని విడాకులతో తెంపుకొమ్మని తన భర్తపై ఒత్తిడి తెస్తోందని మండిపడ్డారు. 
 
రానున్న అసెంబ్లీ ఎన్నికల ముందు బెంగాల్‌ ఫిరాయింపుల పర్వం చోటుచేసుకుంటుంది. ఇప్పటికే పలువురు తృణమూల్‌ నేతలు పార్టీని వీడి బీజేపీలోకి చేరగా... సోమవారం సుజాత బీజేపీ నుండి తృణమూల్‌లో చేరారు. దీంతో సౌమిత్రా ఖాన్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన ఖాన్‌ పేరును తొలగించాలంటూ భార్యను శాసించారు. 
 
తనతో అన్ని సంబంధాలను తెచ్చుకుంటున్నట్లు చెప్పారు. తనకు విడాకులిస్తున్నానని వ్యాఖ్యానించారు. దీనిపై మండిపడ్డ సుజాత.. తన భర్తపై విడాకులు తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని, ఆయన ఇస్తానంటే బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడం లేదని ప్రశ్నించారు.