1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Godavari Levels Dip, Farmers Worry Over Irrigation

Godavari Levels: గోదావరి నదిలో క్రమంగా తగ్గుతున్న నీటి ప్రవాహాలు

Godavari
ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటి ప్రవాహాలు తగ్గడంతో గోదావరి నదిలో నీటి మట్టాలు క్రమంగా తగ్గుతున్నాయి. దీనివల్ల ఖరీఫ్ పంట చివరి దశలో సాగునీటి లభ్యతపై రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు లేకపోవడం, ఎగువ నుంచి వచ్చే నీటి ప్రవాహాలు తగ్గడం వల్ల, ప్రస్తుతం పొలాల్లో ఉన్న పంటలకు అవసరమైన నీరు అందకపోవచ్చని రైతులు భయపడుతున్నారు. 
 
సాధారణంగా ఈ సీజన్‌లో వ్యవసాయ అవసరాలకు సరిపడా నీరు నదిలో అందుబాటులో ఉంటుంది. సాధారణంగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎర్రగా కనిపించే గోదావరి నదీ జలాలు, వర్షాలు లేకపోవడం మరియు తుఫాను సూచనలు లేని పరిస్థితుల నేపథ్యంలో అక్టోబర్ నెలలో నీలిరంగులోకి మారాయి. 
 
ఇది ప్రజల దృష్టిని ఆకర్షించింది. అయితే, ఖరీఫ్ పంటకు నీటి కొరత ఉండదని నీటిపారుదల శాఖ అధికారులు స్పష్టం చేశారు. సిలేరు నది నుండి వచ్చే నీటితో కలిపి మొత్తం 14,620 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని హెడ్‌వర్క్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తెలిపారు. 
 
ఇందులో తూర్పు డెల్టాకు 2,500 క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 1,500 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 5,500 క్యూసెక్కుల చొప్పున మొత్తం 9,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మిగిలిన 5,120 క్యూసెక్కుల నీరు అదనపు నిల్వగా (సర్ప్లస్) ఉందని ఆయన పేర్కొన్నారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
వైకాపా నేత అరాచకం : బీటీ రోడ్డును ట్రాక్టర్‌తో ధ్వంసం చేశాడు..