1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Amazon expands Smartchoice feature to 10 product categories

ఎలక్ట్రానిక్స్ షాపింగ్ కోసం అమెజాన్ స్మార్ట్ ఛాయిస్ ఫీచర్, ఏంటది?

Amazon
బెంగళూరు: 10 వినియోగదారు ఎలక్ట్రానిక్స్ శ్రేణులకి తమ స్మార్ట్ ఛాయిస్ ఫీచర్ యొక్క విస్తరణను అమెజాన్ ఈరోజు ప్రకటించింది. నిపుణులచే రూపొందించబడిన, వినియోగ సందర్భం సిఫారసులను 30 విలక్షణమైన వినియోగం-సందర్భం శ్రేణులకు అందిస్తోంది, ఇది ఇప్పుడు భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ కొనుగోళ్ల కోసం అత్యంత సమగ్రమైన మార్గదర్శక ఆవిష్కరణ అనుభవాలను అందిస్తోంది. ఇప్పటికే ల్యాప్ టాప్స్( గేమింగ్, నాన్-గేమింగ్), టాబ్లెట్స్, ఆడియో(హెడ్ ఫోన్స్, సౌండ్ బార్స్), కెమేరాలు, వాషింగ్ మెషీన్స్, రిఫ్రిజిరేటర్స్‌లో లైవ్‌లో ఉన్న ఈ ఫీచర్ ఇప్పుడు ACలు, మానిటర్స్, PC యాక్ససరీస్ మరియు వేరబుల్స్ ను చేర్చింది, త్వరలోనే TVలు, స్మార్ట్ ఫోన్లు రాబోతున్నాయి. విస్తరణతో పాటు, అమెజాన్ స్మార్ట్ ఛాయిస్ సిఫారసు చేయబడిన ఉత్పత్తులపై డీల్స్ ను కలిగి ఉన్న ‘స్మార్ట్ ఛాయిస్ డేస్’ సేల్ కార్యక్రమాన్ని జూన్ 11న ప్రకటించింది.
 
స్మార్ట్ ఛాయిస్ అనేది వినియోగదారులుక ఎక్కువ ఆప్షన్స్ అవసరం లేదు, కేవలం వారు విశ్వసించే  సరైన ఆప్షన్ కావాలి  అనే  సాధారణ భావనపై రూపొందింది. అవగాహనతో ఉన్న బయ్యర్ కు కూడా  వినియోగదారు ఎలక్ట్రానిక్స్ శ్రేణి  యొక్క  వివిధ ఫీచర్లు, వివరణలు మరియు ఎంపికలు  భారంగా అనిపిస్తాయి. వినియోగదారులు ఎలా వాటిని నిజంగా ఉపయోగిస్తారు విషయంతో ఉత్పత్తులను జత చేయడం ద్వారా స్మార్ట్ ఛాయిస్ ఈ సమస్యను పరిష్కరిస్తుంది. స్మార్ట్ ఛాయిస్‌తో, రూఫస్, లెన్స్ AI, AIచే ఉత్పన్నమైన సమీక్షా సంగ్రహాలు, ధరల చరిత్ర కలిసి పని చేస్తాయి, వినియోగదారు ఎలక్ట్రానిక్స్ యొక్క విస్తృతమైన ఎంపికపై ప్రతి అడుగులో వినియోగదారులు ఆత్మవిశ్వాసంతో కూడిన కొనుగోలు నిర్ణయాలను చేయడంలో సహాయపడే  AIసాధనాలను ద్వారా సమర్థించబడిన నిపుణులచే రూపొందించబడిన సిఫారసులను అమెజాన్ అందిస్తుంది అని జేబా ఖాన్-డైరెక్టర్, వినియోగదారు ఎలక్ట్రానిక్స్, అమేజాన్ ఇండియా పేర్కొంది.
 
స్మార్ట్ ఛాయిస్ ఎలా పని చేస్తుంది
వినియోగదారులు నిజంగా వస్తువులను ఎలా ఉపయోగింస్తారు విషయం ఆధారంగా స్మార్ట్ ఛాయిస్ ఉత్పత్తుల ఎంపిక చేస్తుంది. వివరణలు లేదా ధరలు ద్వారా ఫిల్టర్ చేయబడిన వందలాది ఆప్షన్స్ ను బ్రౌజింగ్ చేయడానికి బదులు, వినియోగదారులు తమ నిర్దిష్టమైన  వినియోగం సందర్భానికి అనుగుణంగా రూపొందించబడిన ఎంపిక చేయబడిన జాబితాకు సూచించబడతారు. ఒక కాలేజీ విద్యార్థి ల్యాప్ టాప్ కోసం పరిశీలిస్తున్నప్పుడు లభించే సిఫారసులు గేమర్ లేదా రిమోట్‌గా పని చేసే వ్యక్తికి ఇచ్చిన సిఫారసుల కంటే భిన్నంగా ఉంటాయి.
 
తమ మొదటి ఏసీని కొనుగోలు చేయడాన్ని పరిశీలిస్తున్న కుటుంబం గది సైజ్ మరియు సామర్థ్యం ఆధారంగా ఎంపికలు పొందుతుంది కానీ కేవలం టన్నేజ్ లేదా బ్రాండ్ సిఫారసులు పొందదు. శారీరక ధారుడ్యం పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తి వేరబుల్స్ ను అన్వేషిస్తున్నప్పుడు వారికి ఫీచర్ జాబితాలకు బదులు కార్యకలాపం ట్రాకింగ్‌కి సంబంధించి రూపొందించబడిన ఎంపికలు సూచించబడతాయి. 10 శ్రేణులు, 30 వాడకం-సందర్భం శ్రేణుల్లో, స్మార్ట్ ఛాయిస్ మొదటి క్లిక్ నుండి సరైన ఉత్పత్తిని కనుగొనడంలో కస్టమర్లకు సహాయపడటానికి వాస్తవిక ప్రపంచం సందర్భంతో నిపుణుల ధృవీకరణను కలుపుతుంది.
 
కస్టమర్లు ఎలా కొనుగోళ్లు చేస్తారు
శ్రేణుల్లో, కస్టమర్లు ఎలక్ట్రానిక్స్‌ను ఏవిధంగా కనుగొని, నిర్ణయిస్తారు విధానాన్ని స్మార్ట్ ఛాయిస్ రూపొందిస్తోంది. ఫీచర్‌ను వినియోగించే కస్టమర్లు కొనుగోలు చేయడానికి ముందు పరిశోధించడానికి 25% తక్కువ సమయం వెచ్చిస్తారు. కంప్యూటింగ్ లో విద్యార్థుల ల్యాప్ టాప్స్ మరియు AI-సమర్థన PCలు అత్యధిక వినియోగాన్ని పొందుతున్నాయి. ఉత్పాదకత-కేంద్రీకృత టాబ్లెట్స్ టాబ్లెట్ శ్రేణిలో ప్రధమ స్థానంలో ఉన్నాయి. కొత్త శ్రేణుల్లో, వినియోగదారులు ప్రీమియం మరియు అత్యధిక వివరణల ఉత్పత్తులు దిశగా ఆకర్షితులవుతున్నారు ముఖ్యంగా టియర్ 2 మరియు టియర్ నగరాల్లో  ఇవి మొత్తం స్మార్ట్ ఛాయిస్ కొనుగోళ్లల్లో 65% వాటాను కలిగి ఉన్నాయి.
 
స్వీకరణను ప్రోత్సహిస్తున్న ప్రముఖ బ్రాండ్స్
స్మార్ట్ ఛాయిస్ వివిధ విభాగాలకు చెందిన ప్రముఖ బ్రాండ్స్ నుండి ఎంపిక చేసిన ఉత్పత్తులను అందిస్తుంది. కంప్యూటింగ్ లో, ఇంటెల్ నాన్-గేమింగ్ ల్యాప్ టాప్ ఎంపికల్లో అగ్రగామిగా నిలిచింది, ASUS తమ ఓమ్నిబుక్ మరియు జెన్ బుక్ శ్రేణి ద్వారా AI PC స్వీకరణను ప్రోత్సహిస్తోంది, NVIDIA  మద్దతు ద్వారా HP మరియు ASUSలు గేమింగ్ ఎంపికలకు నాయకత్వంవహిస్తోంది. లెనోవో ఉత్పాదకత కోసం టాబ్లెట్ ఎంపికలకు నాయకత్వంవహిస్తుండగా, LG మరియు BenQలు ఆఫీస్, గేమింగ్ మరియు కంటెంట్-సృష్టి వాడకం సందర్భాల్లో మానిటర్స్ శ్రేణిలో ఆధిపత్యంవహించాయి. ఉపకరణాల్లో, రిఫ్రిజిరేటర్లు మరియు ACలలో LG మరియు శామ్ సంగ్ లు ప్రముఖ స్వీకరణగా నిలిచాయి.
 
కస్టమర్లు ఇప్పుడు ఈ కింది వినియోగం సందర్భాల్లో స్మార్ట్ ఛాయిస్ సిఫారసులను అన్వేషించవచ్చు:
ల్యాప్ టాప్స్: రోజూవారీ, విద్యార్థి, AI- ఆధారిత, వ్యాపారం, కాజువల్ గేమింగ్, ప్రధాన స్రవంతి గేమింగ్, ఔత్సాహికత గేమింగ్ 
టాబ్లెట్స్ : ఉత్పాదకత, వినోదం, సృజనాత్మకత, గేమింగ్
గేమింగ్ యాక్ససరీస్: కోడర్స్, FPS, MMO మరియు RPG  ప్లేయర్స్ కోసం
వేరబుల్స్: ఫిట్ నెస్ పర్యవేక్షణ, ఆరోగ్యం పర్యవేక్షణ 
TWS ఆడియో:  స్టడీ, ఫిట్ నెస్, ప్రీమియం లిజనింగ్ 
సౌండ్ బార్స్: వివిధ గదుల సైజ్ ల కోసం అనుకూలమైనది
కెమేరాలు: ప్రయాణం, వ్లోగింగ్, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ
మానిటర్స్: పొందికైనవి, ఆఫీస్, అత్యంత వెడల్పైన, ఇస్పోర్ట్స్, గేమింగ్, కంటెంట్ రూపకల్పన
ఎయిర్ కండిషనర్స్: గది-పరిమాణం మరియు సామర్థ్యం ఆధారంగా ఎంపికలు
రిఫ్రిజిరేటర్స్: కుటుంబం-సైజ్ మరియు ఫీచర్ ఆధారిత ఎంపికలు
వాషింగ్ మెషీన్స్: లోడ్-సైజ్ మరియు ఫీచర్ ఆధారిత ఎంపికలు
 
స్మార్ట్ ఛాయిస్ రోజులు
జూన్ 11 నుండి ప్రారంభించి, స్మార్ట్ ఛాయిస్ డేస్ 60% వరకు తగ్గింపు డీల్స్ , నో కాస్ట్ EMI మరియు బ్యాంక్ ఆఫర్లతో శ్రేణుల్లో  నిపుణులు-సిఫారసు చేసిన ఉత్పత్తులను తీసుకువస్తున్నాయి. వినియోగదారులు ల్యాప్ టాప్స్, టాబ్లెట్స్, ACలు, మానిటర్లు, రిఫ్రిజిరేటర్లు, వేరబుల్స్ మరియు ఇంకా ఎన్నో వాటిలో ఎంపిక చేసిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు, ప్రతి ఉత్పత్తికి నిపుణుల ధృవీకరణ మరియు నిర్దిష్టమైన వాడకం సందర్భాలకు అనుగుణంగా ఉంటుంది.
About Writer
ఐవీఆర్