1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Amazon Great Indian Festival Sale 2026 dates announced

గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సేల్‌ను ప్రకటించిన అమెజాన్

Amazon
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సేల్‌ తేదీలను వెల్లడించింది. పండగ ఆఫర్ల కోసం ఎదురు చూసే కొనుగోలుదారులకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్ అక్టోబరు 8వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. 
 
అలాగే, మరో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా 'బిగ్‌ బిలియన్‌ డేస్ 2026' పేరుతో సేల్ తేదీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది అక్టోబరు 9వ తేదీన రాబోతుంది. పండగ సీజన్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌ కంటే ఒక్కరోజు ముందుగానే అమెజాన్‌ సేల్‌ రావడం గమనార్హం. ఫ్లిప్‌కార్ట్‌ బ్లాక్‌ మెంబర్లకు అక్టోబరు 8వ తేదీనే సేల్‌ ప్రారంభమవుతుంది.
 
గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా ఎస్‌బీఐ డెబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డు హోల్డర్స్‌కు 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ అందిస్తామని అమెజాన్‌ తన మైక్రోసైట్‌లో పేర్కొంది. ప్రైమ్ మెంబర్లకు 10 శాతం వరకు అదనపు ఆఫర్లు ఉంటాయని తెలిపింది. 
 
సేల్‌ ఎప్పటివరకు అనేది మాత్రం వెల్లడించలేదు. 8 పీఎం డీల్స్‌, బ్లాక్‌ బస్టర్‌ డీల్స్‌, టాప్‌ 100 డీల్స్‌, మెగా డీల్స్‌ పేరుతో పలు రకాల ఆఫర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఆఫర్ల వివరాలు సేల్‌ తేదీ దగ్గర పడే కొద్ది వెల్లడికానున్నాయి. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
గుండె లయను ఆపేసిన డీజే సౌండ్ - చిందులేస్తూ చితికిన ప్రాణం (వీడియో)