1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Customs officials in Chennai seize gold

చెన్నైలో జీన్స్ ప్యాంటులో బంగారం.. వ్యక్తి అరెస్ట్

Customs officials
తమిళనాడులోని చెన్నైలో జీన్స్ ప్యాంటులో బంగారాన్ని దాచిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. దుబాయ్‌ నుంచి విమానంలో వచ్చిన ఇద్దరు ప్రయాణికులను చెన్నై విమానాశ్రయంలోని కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. 
 
బంగారాన్ని పేస్టుగా చేసి సన్నని కవర్లలో ఉంచి జీన్స్‌ ప్యాంటులోని బెల్ట్‌ భాగం వద్ద దాచిన విషయాన్ని వారు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న 731 గ్రాముల బంగారం ముద్ద విలువ రూ.34.5 లక్షలని కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. బంగారం అక్రమ రవాణాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఐఎస్ బీ ఒప్పందం: మంత్రి మేకపాటి