1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. gold prices decrease in telugu states silver follows same path

తెలుగు రాష్ట్రాల్లో బంగారు - వెండి ధరలు ఎలా ఉన్నాయ్...

gold
తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ నగంరంలో 10 గ్రాముల క్యారెట్ల బంగారం ధర రూ.1,52,670గా ఉండగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,940గా ఉమోదైంది. కిలో వెండి ధరపై రూ.100 తగ్గింది. గురువారం రోజు ధరలతో పోల్చితే పసిడి రేట్లలో కొంతమేరకు తగ్గింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ధరలు ఒకేలా కొనసాగుతున్నాయి. 
 
ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,14,500గా నమోదైంది. పసిడి బాటలోనే వెండి ధరలు కూడా పయనిస్తున్నాయి. కిలో వెండి ధర రూ.110 మేర తగ్గి ప్రస్తుతం రూ.2,44,900 వద్ద కొనసాగుతోది. ఈ ధరలు తెలంగాణాలోని హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాదా నగరాలతో పాటు ఏపీలోని విజయవాడ, విశాఖపట్టణం, గుంటూరు, తిరుపతి, నెల్లూరు వంటి ప్రధాన నగరాల్లో దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. 
 
అయితే, అంతర్జాతీయ మార్కెట్ పోకడలు, డాలర్ విలువలో మార్పులు, స్థానిక డిమాండ్ వంటి వివిధ కారణాల వల్ల బంగారం, వెండి ధరలు రోజంతా హెచ్చుతగ్గుదలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కొనుగోలుదారులు ఆభరణాలు కొనేముందు అప్పటి తాజా ధరలను మరోమారు సరిచూసుకోవాలని మార్కెట్ నిపుణులు చూస్తున్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
గణేష్ నిమజ్జన ఊరేగింపులో గుండెపోటుతో వ్యక్తి మృతి..