సోమవారం, 9 మార్చి 2026
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 మార్చి 2026 (13:20 IST)

భారీగా పతనమైన వెండి ధరలు.. కిలోకు రూ.20వేలు తగ్గుముఖం

Silver Gold
బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అలాగే వెండి ధరలు కూడా పెంపును నమోదు చేసుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. వరుసగా మూడు రోజుల్లో బంగారం ధర రూ.8580 నుంచి రూ.7850 వరకు తగ్గింది. 
 
అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతోనే బంగారం ధరలు తగ్గుతున్నట్లు నిపుణులు చెప్తున్నారు. రూపాయి మారకం కూడా డాలర్‌తో పోలిస్తే మరో 67 పైసలు తగ్గింది. ఇదంతా బంగారం, వెండి ధరల తగ్గుదలకు కారణమైంది. మార్చి 4వ తేదీన బంగారం వెండి ధరల విషయానికి వస్తే.. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ.3110 తగ్గి రూ.1,64,510కి తగ్గింది. అలాగే వెండి కూడా భారీగా పతనమైంది. 
 
జనవరిలో ఏకంగా 60 శాతం పెరిగిన వెండి కిలో రూ.4లక్షల మార్కుకు అందుకోగా, ఫిబ్రవరి నుంచి తగ్గుతూ వచ్చింది. బుధవారం కిలో వెండిపై రూ.20 వేలు తగ్గింది. రూ.20వేలు తగ్గడంతో వెండి ధర రూ.2,95,000కు పతనమైంది.