1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Pioxazon, India-s first discovered insecticide molecule brought to farmers by PI

పురుగుమందు అణువు పియోక్సాజోన్‌ను రైతులకు అందిస్తోన్న పై

Pioxazon
హైదరాబాద్‌: భారతదేశంలోనే తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన పురుగుమందు అణువుతో రూపొందించిన పియోక్సాజోన్‌ (పియోక్సానిలిప్రోల్‌ 20% ఎస్సీ)ను పై ఇండస్ట్రీస్‌ నేడు మార్కెట్లోకి విడుదల చేసింది. వరి, మొక్కజొన్న, శనగ పంటల కోసం అభివృద్ధి చేసిన పియోక్సాజోన్‌ శాస్త్రీయ ఆవిష్కరణ నుంచి వాణిజ్యపరమైన వినియోగం వరకు పై  సంస్థ సాగించిన ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.
 
దీని అణువు, పియోక్సానిలిప్రోల్‌ భారత వ్యవసాయ ఆవిష్కరణల ప్రయాణంలో ఒక కీలక ఘట్టంగా నిలుస్తోంది. ఇండియా ఇప్పుడు తమ సొంత పంట సంరక్షణ ఆవిష్కరణలు చేయడంతో పాటుగా వాటిని అభివృద్ధి చేయడం, అనుమతులు పొందడం, వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావడం వంటివి చేయగలదని ఇది నిరూపిస్తోంది. ఈ పూర్తి ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసిన తొలి ఉత్పత్తి పియోక్సాజోన్‌®.
 
భారతీయ వ్యవసాయ రంగంలో వరి, మొక్కజొన్న, శనగ అత్యంత ముఖ్యమైన పంటలు. దక్షిణ భారతదేశంలో వ్యవసాయానికి ఇవి వెన్నెముకగా నిలుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ను ‘భారతదేశపు వరి ధాన్యాగారం’గా పరిగణిస్తారు. దేశంలోనే అతిపెద్ద మొక్కజొన్న ఉత్పత్తి రాష్ట్రంగా, కర్ణాటక నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో పండించే పప్పుధాన్యాల్లో శనగ ప్రధాన పంటగా ఉంది. ఈ ప్రాంతంలోని లక్షలాది రైతు కుటుంబాలకు ఈ పంటలను కాపాడుకోవటమంటే,  వారి జీవనోపాధిని కాపాడుకోవడమే.
 
మారుతున్న చీడపీడల ప్రభావం, అనిశ్చిత వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న పంట సంరక్షణ ఖర్చులు భారతీయ రైతులకు సవాళ్లుగా మారుతున్నాయి. వరి పంటలో పసుపు కాండం తొలిచే పురుగు, మొక్కజొన్నలో లద్దె పురుగు, శనగలో కాయ తొలిచే పురుగు రైతులకు ప్రధాన సమస్యలుగా కొనసాగుతున్నాయి.
 
భారత వ్యవసాయ రంగంతో పై సంస్థకు ఉన్న ఎనిమిది దశాబ్దాల అనుబంధం, అనుభవంతో వివిధ పంటల సాగు పరిస్థితులకు అనుగుణంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పియోక్సాజోన్‌ను క్షేత్రస్థాయిలో పరీక్షించారు. వరి పంటలో పసుపు కాండం తొలిచే పురుగు, మొక్కజొన్నలో లద్దె పురుగు, శనగలో కాయ తొలిచే పురుగు నియంత్రణ కోసం వినియోగించేందుకు అనువుగా ఉంటుందని సెంట్రల్‌ ఇన్‌సెక్టిసైడ్స్‌ బోర్డు అండ్‌ రిజిస్ట్రేషన్‌ కమిటీ (సీఐబీ అండ్‌ ఆర్‌సీ) అనుమతులు మంజూరు చేసింది.
 
ఈ ఉత్పత్తి విడుదల సందర్భంగా పై ఇండస్ట్రీస్‌ వైస్‌ చైర్‌పర్సన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ మయాంక్‌ సింఘాల్‌ మాట్లాడుతూ “ పై యొక్క  ఆవిష్కరణల ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా పియోక్సాజోన్‌ నిలుస్తోంది. పియోక్సానిలిప్రోల్‌ ద్వారా సొంత శాస్త్రీయ ఆవిష్కరణలు చేయడంతోపాటు, వాటిని అభివృద్ధి చేయడం, అనుమతులు పొందడం వరకు పూర్తి ఆవిష్కరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయగల సామర్థ్యం మాకు ఉందని నిరూపించాం. పియోక్సాజోన్‌® రైతులకు అందుబాటులోకి వస్తుండటంతో, భారతదేశంలోని విభిన్న వ్యవసాయ పరిస్థితులపై లోతైన అవగాహనతో స్వదేశీ ఆవిష్కరణను పరిశోధన స్థాయి నుంచి క్షేత్రస్థాయికి తీసుకెళ్తున్నాం. రైతుల కోసం,  ప్రస్తుతం ఎదురవుతున్న చీడపీడలు, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పరిష్కారంగా ఇది నిలుస్తుంది. పై కు ఇది భారతీయ ఆవిష్కరణల్లో అత్యుత్తమమైన వాటిని ప్రపంచానికి అందించాలన్న ఆశయాన్ని బలపరుస్తుంది” అని తెలిపారు.
 
పియోక్సాజోన్‌ నాలుగు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది. పిచికారీ చేసిన 30 నిమిషాల్లోనే మొక్కలోకి ఇది వేగంగా శోషించబడుతుంది. దీనివల్ల వర్షం పడినప్పుడు కూడా మందు ప్రభావం తగ్గకుండా ఉంటుంది. అనిశ్చిత వాతావరణ పరిస్థితుల్లోనూ మెరుగైన పనితీరును కనబరుస్తుంది. దీని ప్రత్యేకమైన అణు నిర్మాణం చీడపీడలపై అధిక బంధన సామర్థ్యాన్ని కలిగి ఉండటం వల్ల అత్యధిక సమర్థతతో పాటు స్థిరమైన, సమర్థవంతమైన రక్షణను అందిస్తుంది.
 
మొక్క అంతటా గరిష్ఠ స్థాయిలో అందుబాటులో ఉండటంతోపాటు, అసాధారణమైన ట్రాన్స్‌లామినార్‌ చర్య కారణంగా మొక్క అంతటా వేగంగా వ్యాపించి, ఎక్కువ కాలం పాటు చీడపీడలను నియంత్రిస్తుంది. అంతేకాకుండా మొక్కల పెరుగుదలను ప్రేరేపించే( ఫైటోటానిక్‌) ప్రభావాన్ని కూడా అందిస్తుంది.
 
పంటకు మేలు చేసే పురుగులకు ఇది అత్యంత సురక్షితమైనది. చీడపీడల సంఖ్యను సహజంగా నియంత్రించడంలో సహాయపడే హానికర పురుగులను వేటాడి తినే సాలీళ్లు(ప్రిడేటరీ స్పైడర్స్), పెంకు పురుగులు(బీటిల్స్‌), ఆరుద్ర పురుగులు( లేడీబర్డ్‌ బీటిల్స్‌), సన్నని రెక్కల తూనీగలు(డ్యామ్‌సెల్‌ఫ్లైస్‌), పచ్చటి జాలీ రెక్కల పురుగు( గ్రీన్‌ లేస్‌వింగ్స్‌)వంటి పంటకు మేలు చేసే పురుగులకు ఎలాంటి హాని కలిగించదు. దీంతో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిచ్చే ఉత్పత్తిగా, సమగ్ర సస్యరక్షణ విధానాలకు అనువైనదిగా పియోక్సాజోన్‌ నిలుస్తుంది.
 
పై అగ్రిసైన్సెస్‌ ఇండియా బ్రాండ్స్‌ సీఈఓ సాకేత్‌ భట్నాగర్‌ మాట్లాడుతూ, “పిచికారీ చేసిన తర్వాత పొలంలో ఎలాంటి ఫలితం వస్తుందన్న దానిపైనే రైతులు పంట సంరక్షణ ఉత్పత్తి పనితీరును అంచనా వేస్తారు. వాతావరణం మారినప్పటికీ వేగంగా పనిచేయడం, ఎక్కువ కాలం చీడపీడలను నియంత్రించడం వంటి కీలక అవసరాలను తీర్చేలా పియోక్సాజోన్‌ను రూపొందించాం. వరి, మొక్కజొన్న, శనగ పంటలు పండించే ప్రాంతాల్లో మా పంపిణీదారులు, రిటైలర్ల నెట్‌వర్క్‌ ద్వారా రైతులకు పియోక్సాజోన్‌ను అందుబాటులోకి తీసుకెళ్తాము. దీనికితోడు క్షేత్రస్థాయి ప్రదర్శనలు, సరైన వినియోగంపై రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తాం” అని తెలిపారు.
 
భారత్‌లోనే కనుగొనబడి, భారతీయ పొలాల అవసరాలకు అనుగుణంగా రూపొందించబడిన పియోక్సాజోన్‌ భారతీయ శాస్త్ర విజ్ఞానం భారతీయ రైతులకు చేరిన క్షణానికి నిదర్శనంగా నిలుస్తుంది.
About Writer
జయ
Content provider.... మరింత చదవండి
తర్వాతి కథనం
రీపోలింగ్ నిర్వహిస్తేనే ఓటు వేస్తా : పులివెందుల సిట్టింగ్ ఎమ్మెల్యే జగన్