1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Will gold price fall further here is what analysts say

పసిడి ధర లక్ష రూపాయలకు దిగువకు పడిపోతుందా? నిపుణులు ఏమంటున్నారు?

gold
దేశంలో బంగారం ధరలు ఒక దశలో తారా స్థాయికి చేరుకున్నాయి. అయితే, గత కొన్ని రోజులుగా ఈ ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అదేసమయంలో సోమవారం నాటి ఆసియా ట్రేడింగులో స్వల్పంగా పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర క్రమంగా రూ. లక్ష మార్కుకు పడిపోతుందా? లేదా? అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.
 
గత వారంలో దాదాపు 9 శాతం మేర క్షీణించిన స్పాట్ గోల్డ్, తాజా ట్రేడింగ్ 1.2 శాతం లాభపడి ఔన్సుకు 3,576.10 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 1.7 శాతం పెరిగాయి. దేశీయ మార్కెట్ విషయానికి వస్తే, ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) తాజా గణాంకాల ప్రకారం.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.5,638 తగ్గి రూ.1,23,893 వద్ద ముగిసింది. అలాగే కిలో వెండి ధర రూ.7,911 క్షీణించి రూ.1,52,528 వద్దకు చేరింది.
 
అమెరికా డాలర్ బలోపేతం కావడం, బాండ్ ఈల్డ్స్ పెరగడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశం ఉందన్న సంకేతాలు పసిడి పతనానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. బంగారు వ్యాపార రంగ నిపుణులు మాట్లాడుతూ, ఒకవేళ రూపాయి విలువ గణనీయంగా పుంజుకుని, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 3,000 డాలర్ల స్థాయికి దిగివస్తే, భారత్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,000 వరకు పడిపోయే అవకాశాన్ని కొట్టిపారేయలేమని పేర్కొన్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
దక్షిణ అండమాన్ తీరంలో మరో తుఫాను... 27 నుంచి విస్తారంగా వర్షాలు