ఖరగ్ పూర్ ఐఐటీలో ఎంబీబీఎస్ కోర్సులు.. 26 నెలల్లోనే పని పూర్తి!
ఐఐటీ ఖరగ్ పూర్‌లో ఇంజనీరింగ్ కోర్సులే కాదు.. ఎంబీబీఎస్ కోర్సులు కూడా రానున్నాయి. ఇంజనీరింగ్ విద్యకు ప్రసిద్ధి చెందిన ఖరగ్ పూర్ ఐఐటీ తన పరిధిని విస్తరించాలని సన్నాహాలు చేస్తోంది.
త్వరలో ఈ కళాశాలలో ఎంబీబీఎస్ కోర్సును కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఇందుకోసం కళాశాల క్యాంపస్‌లోని మూడెకరాల స్థలంలో డాక్టర్ బీసీ రాయ్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ భవనం 2017 కల్లా రెడీ కానుంది.
ఖరగ్ పూర్ ఐఐటీలో 400 పడకలతో కూడిన ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నట్లు ఐఐటీ-ఖరగ్ పూర్ డైరెక్టర్ పార్థ ప్రతిం చక్రవర్తి తెలిపారు. ఈ ప్రతిపాదన కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 230- కోట్ల నిధిని విడుదల చేసిందని, రెండో విడతగా 750 పడకలతో కూడిన ఆస్పత్రిగా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పార్థ ప్రతిం చక్రవర్తి అన్నారు.
