1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చైనీస్

చైనీస్ ఫుడ్డింగ్

చైనీస్ ఫుడ్డింగ్ ఫైనాపిల్ జెల్లీ స్ట్రాబెర్రీ పాలు చైనా గడ్డి పంచదార
కావలసిన పదార్థాలు :
ఫైనాపిల్ జెల్లీ... అర ప్యాకెట్
స్ట్రాబెర్రీ జెల్లీ... అర ప్యాకెట్
పాలు... రెండు కప్పులు
సన్నగా తరిగిన చైనా గడ్డి... 2 టేబుల్ స్పూన్లు
పంచదార... 3 టేబుల్ స్పూన్లు
ఆల్‌మండ్స్... కట్ చేసినవి 2 స్పూన్లు
ఆల్‌మండ్ ఎసెన్స్... కొన్ని చుక్కలు
షుగర్... ఒక కప్పు
నీళ్ళు... 4 కప్పులు

తయారీ విధానం :
ముందుగా నీటిలో షుగర్ కరిగించి మిశ్రమం తయారు చేసి, ఫ్రిజ్‌లో ఉంచాలి. ప్యాకెట్ మీదనున్న సమాచారం ప్రకారం రెండు రకాల జెల్లీలను తయారు చేసుకోవాలి. రెండింటినీ విడివిడిగా తయారు చేసి ఫ్రిజ్‌లో పెట్టి ఉంచాలి. చైనా గడ్డిని అరకప్పు నీటిలో కలిపి సన్నటి మంటమీద ఉడికించి, దానికి పాలు, 3 స్పూన్ల చక్కెర కలిపి ఉడికించి షుగర్ కరిగిన తరువాత దించాలి. చల్లారిన తరువాత ఎసెన్స్, ఆల్‌మండ్ ముక్కలు వేసి కలిపి ఫ్లాట్‌గా ఉండే డిష్‌లో పోసి ఫ్రిజ్‌లో ఉంచి చల్లబరచాలి.

ఇవన్నీ గడ్డకట్టిన తరువాత తీసి జెల్లీలను, గ్రాస్‌ను డైమండ్ షేప్‌లో కట్ చేసి సర్వింగ్ డిష్‌లో ముక్కలను ఉంచి వాటిమీద ముందుగా తయారు చేసుకున్న షుగర్ మిశ్రమం పోయాలి. దానిపై డ్రెయిన్డ్ లిచీస్‌ను అమర్చిన తరువాత సర్వ్ చేయాలి. షుగర్ మిశ్రమం బదులు ఐస్‌క్రీమ్ లేదా క్రీముతో సర్వ్ చేసుకోవచ్చు.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి